పుష్కర కాలువలో పడి వ్యక్తి మృతి
ప్రత్తిపాడు రూరల్: కాలువలో పశువులను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫిట్స్ వచ్చి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రాచపల్లిలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం ఒమ్మంగికి చెందిన దొండపాటి సింహాచలం తన పశువులను రాచల్లి అడ్డురోడ్డు వద్ద పుష్కర కాలువలోకి మళ్లించాడు. కాలువలో పశువులను కడుగుతుండగా సింహాచలానికి ఫిట్స్ రావడంతో నీటిలో పడిపోయాడు. దీనిని గుర్తించిన స్థానికులు ఆయన్ని ఒడ్డుకు చేర్చి సపర్యలు చేశారు. అతడిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


