ఫ నిమజ్జనోత్సవ వైభవం
కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించే గౌరీశంకరుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. స్వామి, అమ్మవార్లను గ్రామస్తులు రెండు నెలలుగా ప్రతి రోజూ భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం, శనివారం నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందులో గ్రామానికి చెందిన మహిళా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా గౌరీశంకరుల మూర్తులను బాణసంచా కాల్పులు, డప్పు వాయిద్యాల సందడి నడుమ గ్రామంలో ఊరేగించి, స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.
– కిర్లంపూడి


