ఇక్కట్ల సాగరం..
క్లుప్తంగా
● బాక్స్ బద్దలు..
అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులు తమకు కలిగే ఇబ్బందులపై అధికారులకు ఫిర్యాదు చేయడానికి పెట్టిన ఫిర్యాదుల పెట్టె ఇది. దీనిని పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేశారు. ఈ పెట్టె తలుపు విరిగిపోయి లోపలకు పోయింది. ఇందులో వేసిన ఫిర్యాదులు, సలహాలు, సూచనల పేపర్లు కింద పడిపోతున్నాయి. విశేషమేమిటంటే దీనికో తాళం వేశారు. స్పందన దేవుడెరుగు.. ముందు ఫిర్యాదు పెట్టైనెనా మార్చండని భక్తులు అంటున్నారు.
–అన్నవరం
● సంగోతి తెలుసా!
కడియం హైస్కూల్ సమీపంలో గోతులతో జనం నరకం చూస్తున్నారు. ఇటుగా వెళ్తున్న ఓ యువకుడు రోడ్డుపై ఉన్న గోతులను పూడ్చేందుకు తన ఇంటి వద్ద నుంచి కాంక్రీట్‌ను మోటారు సైకిల్‌పై తీసుకువచ్చి భారీ గోతులు పూడ్చడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. సదరు యువకుడిపై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురిసింది. అదే సమయంలో కడియం వయా వీరవరం నుంచి దుళ్ల రోడ్డులో ప్రయాణం నరకంలా మారిందని ప్రభుత్వాన్ని జనం విమర్శిస్తున్నాయి. –కడియం
● అపురూపం.. ఆ నాణెం
ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా విడుదలైన రూ.150 వెండి నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముంబయి టంకశాల ఈ వెండి నాణేన్ని విడుదల చేసింది. నాణెంపై ఓ వైపు ముఖ విలువ, రెండో వైపు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రాన్ని ముద్రించారు.
–అమలాపురం టౌన్
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 27,000
గటగట (వెయ్యి) 25,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 25,000
గటగట (వెయ్యి) 23,000
నీటికాయ
పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,500 – 14,000
కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000
కిలో 400
ఫ కానరాని పర్యాటక అభివృద్ధి
ఫ బీచ్‌లో మౌలిక వసతులు కరవు
ఫ సేద తీరేందుకు షెల్టర్లు లేక ఇబ్బంది
సఖినేటిపల్లి: ఎగసిపడే అలలు.. కనువిందు చేసే ఇసుక తిన్నెలు.. మరోపక్క ఆధ్యాత్మిక పరవళ్లు.. ప్రకృతి సోయగం నడుమ సాగర తీరాన ఆ హాయి వర్ణనాతీతం.. అలాంటి చోట పర్యాటక అభివృద్ధి కానరాకుంది.. అంతర్వేది బీచ్‌కు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు, భక్తులు వస్తుంటాయి. ఇక్కడకు జిల్లా నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తాయి. అలాంటి చోట సౌకర్యాల కల్పనకు పర్యాటక శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడకు వేలాదిగా భక్తులు వస్తుంటారు. స్వామివారి కల్యాణోత్సవాల సమయంలో లక్షల్లో భక్తజనం వస్తుంది. ఈ ఆలయానికి అతి సమీపంలో ఈ బీచ్ ఉంటోంది. అందుకే ఆధ్యాత్మికంగా, ఆహ్లాదం కోసం ఇక్కడి వచ్చేవారు వేలాదిగా ఉంటారు. ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్వేది బీచ్‌పై పర్యాటక శాఖ ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. పర్వదినాల్లో లక్షల్లో, సాధారణ రోజుల్లో వేలల్లో వచ్చే సందర్శకులకు తగ్గట్టు సౌకర్యాలు లేక ఇబ్బంది ఎదురవుతోంది.
గూడు పోయి.. శిథిలాలు మిగిలాయి
అంతర్వేది బీచ్‌లో గతంలో సరుగుడు తోటలకు చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన హట్‌లు అధికారుల ఆలనా పాలన లేక పూర్తిగా కనుమరుగయ్యాయి. తీరానికి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటక శాఖ ద్వారా విడుదలైన నిధులతో 2018లో ఈ పనులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా బీచ్‌లో దాత పెన్మెత్స సత్యనారాయణరాజు ఉచితంగా ఇచ్చిన ఇరవై సెంట్ల స్థలంలో పర్యాటక నిధులతో అప్పట్లో జమ్ముగడ్డి, తాటిపట్టెలతో కూడిన హట్స్, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హట్స్ చివికిపోయి ఆ ప్రాంతంలో తాటిపట్టెలు, దూలాలు మిగిలాయి.
ఇసుకపైనే కూర్చుని..
కార్తిక మాసం, ఇతర పర్వదినాల్లో బీచ్‌లో సరదాగా గడపడానికి, వెంట తెచ్చుకునే భోజన పదార్థాలు తినడానికి వసతులు లేక పర్యాటకులు పడుతున్న వెతలు వర్ణనాతీతం. బీచ్‌లో పిల్లాపాపలతో సేద తీరేందుకు షెల్టర్లు లేక, తాగడానికి గుక్కెడు నీరు లేక వెనుతిరిగే పరిస్థితి నెలకొంది. ఇసుకపైనే కూర్చొని, అరచేతిలోనే ఆకులు పెట్టుకుని భోజనంచేసే పరిస్థితులు ఉన్నాయి.
● కనీసం నీడ లేక..
అంతర్వేది బీచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేవు. పిల్లాపాపలతో వస్తున్న వారు సేద తీరేందుకు నీడ లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా షెల్టర్లు, తాగునీటి వసతి కల్పించాలి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అంతర్వేదికి ప్రాధాన్యం ఉంది. దానిని కాపాడే చర్యలు అవసరం.
–రావి దుర్గ ఆలేంద్రమణి,
జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు,
అంతర్వేది
రక్తపింజర హతం
పి.గన్నవరం: మండలంలోని ఆర్.ఏనుగుపల్లి గ్రామంలో శనివారం వరి చేలలో 10 అడుగుల రక్త పింజర హల్‌చల్ చేసింది. కోత కోసిన చేనులో కూలీ లు వరి పనలను కట్టలు కడుతుండగా ఈ పాము కనిపించింది. దీంతో కూలీలు భయబ్రాంతులకు గురై, పరుగులు తీశారు. ఎట్టకేలకు కూలీలు దానిని హతమార్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజుల క్రితం ఇదే చేనులో వరి కోతలు కోస్తుండగా ఈ పాము కనిపించిందని కూలీలు వివరించారు. ఎర్ర కంకర లోడుతో వస్తున్న లారీల ద్వారా రక్త పింజర పాములు మన ప్రాంతాలకు వస్తున్నాయని భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ జంపన గణేష్‌వర్మ తెలిపారు. ఈ పాము లు అత్యంత ప్రమాదకరమని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
0000670326-000001-Punjab National
14.00x12.00
Punjab National Bank
సర్వం బుగ్గి
ఫ నాలుగు
పూరిళ్లు దగ్ధం
ఫ రూ.20 లక్షల
ఆస్తి నష్టం
ప్రత్తిపాడు రూరల్: పెద్దిపాలెం గ్రామంలోని నూకాలమ్మ తల్లి గుడి వెనుక శనివారం తెల్లవారుజామున మూడు ఇళ్లు పూర్తిగా, ఒక ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రాళ్ల అప్పారావు ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించేలోపే ఆ మంటలు రాళ్ల రాజు, రాళ్ల ఆనందరావు, నైనపు గోవింద్, అప్పలనర్సమ్మ ఇళ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లు పూర్తిగా, ఒక ఇల్లు పాక్షికంగా కాలిపోయాయి. ఇళ్లలో విలువైన గృహోపకరణలు, వంట సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. నిరుపేద కుటుంబాలు కావడంతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. అంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఆ కుటుంబాలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా ఇళ్లపై నుంచి వెళ్తున్న సర్వీస్ వైర్లను తొలగించాలని విద్యుత్ డీఈ, ఏఈలను కోరారు. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆ కుటుంబాలకు రూ.ఐదు వేల చొప్పున నగదు, బియ్యాన్ని అందజేశారు. ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బెహరా దొరబాబు, పార్టీ మండల కన్వీనర్ రామిశెట్టి బులిరామకృష్ణ, వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీను, నాయకులు మాకా చంటిబాబు, విత్తనాల నాగేశ్వరరావు, దేవర రాధాకృష్ణ, లొండ బాబు, దేవ లక్ష్మణ్, ఏనుగు జాన్ తదితరులు ఉన్నారు.
అద్దె గదులు కష్టమే..
సుదూర ప్రాంతాల నుంచి అంతర్వేదికి వచ్చి ఒకటి, రెండు రోజులు గడుపుదామనుకునే వారికి వసతి గదులు అద్దెకు తీసుకోవడం కష్టమే. దేవస్థానానికి తగిన సంఖ్యలో వసతి గదులు లేకపోవడం, క్షేత్రంలో ప్రైవేట్ వసతి గదులు ఆశ్రయించడం ఆర్థికంగా భారంగా మారుతోంది. ప్రైవేటు వ్యక్తులు గది ఒక్కంటికి రోజుకు సాధారణ రోజుల్లో రూ.1,500, పర్వదినాల్లో రూ.2 వేలు డిమాండ్ చేస్తుండడం వారికి పెనుభారంగా పరిణమిస్తోంది. పర్యాటక శాఖ ఈ ఇబ్బందులు తీర్చేందుకు తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.
సందర్శనీయ స్థలాలు
అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం అనంతరం భక్తులు, పర్యాటకులకు ప్రముఖమైన సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. అశ్వరూడాంబికా, వశిష్ట ఆశ్రమం, సాగర సంగమం, లైట్‌హౌస్ సమీపంలో మడ అడవులు ఉన్నాయి. అయితే వీటి సందర్శనకు సరైన సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. బీచ్, సాగర సంగమం వద్దకు అనేమంది వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ప్రధానంగా బీచ్‌లో షెల్టర్లు, మౌలిక వసతులు లేక నిరుత్సాహానికి గురవుతున్నారు. ఏటా కార్తిక, మాఘ మాసాల్లో సుమారు 5 లక్షల వరకూ, సాధారణ రోజుల్లో 15 వేల మంది బీచ్‌ను సందర్శిస్తారు.
వెనుతిరుగుతున్న పర్యాటకులు
సుదూర ప్రాంతాల నుంచి ఉత్సాహంగా బీచ్‌కు సందర్శకులు వస్తున్నారు. ఇక్కడి పరిస్థితి చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతమంది అయితే బాబోయ్ అంటూ వెనుతిరుగుతున్నారు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు తినేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అంతర్వేది బీచ్‌లో సౌకర్యాలు మెరుగుపర్చితే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది.
–ఉండపల్లి వరలక్ష్మి, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు, కేశవదాసుపాలెం
ఇక్కట్ల సాగరం..
ఇక్కట్ల సాగరం..
ఇక్కట్ల సాగరం..
ఇక్కట్ల సాగరం..
ఇక్కట్ల సాగరం..
ఇక్కట్ల సాగరం..
ఇక్కట్ల సాగరం..
ఇక్కట్ల సాగరం..


