శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
కత్తిపోట్లు.. పక్కలో బల్లేలు!
● మూలపేటలో అలరించిన కళారూపాలు
● ఉత్సాహంగా గౌరీదేవి మహోత్సవాలు
మండలంలో మూలపేటలో గౌరీదేవి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన కత్తిపోటు వేషాలు స్థానికులను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రాచీనకళ అయిన ఈ కత్తిపోటు వేషాలను మూలపేట వాసులు పూర్వం నుంచి ప్రదర్శిస్తున్నారు. కార్తిక మాసంలో గౌరీదేవిని తాము ఆడపడుచుగా భావించి గ్రామంలో నిలిపి ప్రత్యేక పూజలు చేస్తామని ఉత్సవ నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా కత్తిపోటు వేషాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ వేషాలు వేసి మూడేళ్లు అయ్యిందని, మళ్లీ ఈ ఏడాది ప్రదర్శిస్తున్నట్టు వారు తెలిపారు. ఇందులో గునపం పోటు, రంపపు కోత, బల్లెం పోటు, గొడ్డలి నరుకు, జబ్బ నరుకు, మహిషాసురమర్దిని, నరకాసుర వధ వంటి అంశాలను ప్రదర్శించారు. కత్తిపోటు వేషాల సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో మూలపేట గ్రామం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమాన్ని పట్టుశాలీ సంఘం సభ్యులు పర్యవేక్షణలో నిర్వహించారు.
– కొత్తపల్లి
బల్లెంపోటు
జబ్బ నరుకు
పక్కలో బల్లెం
త్రిశూలంతో పొడిచి దుష్ట సంహారం చేస్తున్న వినాయకుడు
మహిషాసురుని మర్దిస్తున్న జగన్మాత
కత్తిపోటు వేషాలను చూసేందుకు వచ్చిన భక్తులు
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025


