ఆమె ఖ్యాతి.. ఖగోళమంత!
● ఆస్ట్రానాట్ అభ్యర్థిగా కై వల్య ఎంపిక
● వ్యోమగామిగా నాలుగేళ్ల పాటు శిక్షణ
● అసాధారణ ప్రతిభ ఆమె సొంతం
● అంతర్జాతీయ పటంపై ఆమె సంతకం
ఖగోళ శాస్త్రవేత్తగా దేశానికి
సేవలందించమే నా లక్ష్యం
ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఖగోళ శాస్త్రవేత్తగా దేశానికి సేవలందించమే నా లక్ష్యం. చిన్నతనం నుంచి ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉంది. అంతరిక్ష వ్యామగామి కల్పనా చావ్లా, స్టీఫెన్ హాకింగ్, అబ్దుల్ కలాం అంటే ఎంతో ఇష్టం. వారిని ఆదర్శంగా తీసుకుని దేశానికి సేవలందిస్తాను. తల్లిదండ్రుల నన్ను ఎంతగానో ప్రొత్సహిస్తున్నారు.
– కుంచాల కై వల్యరెడ్డి, నిడదవోలు
నిడదవోలు: పట్టణానికి చెందిన కుంచాల కై వల్యరెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 2029లో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్‌గా ఎంపిక కావడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల ప్రాయంలోనే వివిధ కళలు, పోటీ పరీక్షల్లో తనకంటూ ప్రత్యేకత చాటుతూ ముందుకు దూసుకుపోతోంది. తల్లిదండ్రుల ప్రొత్సాహంతో అనేక పోటీల్లో విజయకేతనం ఎగువవేస్తూ ఎన్నో పతకాలను సొంతం చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన కుంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు మొదటి సంతానం కై వల్యరెడ్డి. తండ్రి పంచాయతీ ఈవోగా, తల్లి మనోజ్ఞ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్‌గా సామాజిక సేవ చేస్తున్నారు. కౌవల్య నాలుగేళ్ల ప్రాయం నుంచే చిత్రలేఖనం, ఫ్యాన్సీ, డ్రెస్, వ్యాసరచన, వక్తృత్వం, కూచిపూడి, భరతనాట్యం, కరాటే వంటి పోటీల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
కరెన్సీ, నాణేలు, స్టాంపుల సేకరణలో
దేశ, విదేశీ కరెన్సీ, పురాతన నాణేలు, విదేశీ స్టాంపుల సేకరణలో ఆమె ఆసక్తి చూపేది. ఐదో తరగతిలో ఉండగా విదేశీ కరెన్సీ సేరణతో పాటు వివిధ దేశాల కరెన్సీ పేర్లు కూడా టక్కున చెప్పిన ప్రతిభాశాలి. ఏలూరులో ఇటీవల జరిగిన డివిజనల్ విదేశీ కరెన్సీ అవగాహన సదస్సులో ప్రదర్శించి అందరినీ ఆటకట్టుకుంది.
ఆకట్టుకుంటున్న వేషధారణలు...
అంతే కాదు జాతీయ నాయకుల వేషధారణలో ఆమె ఎన్నోసార్లు మెరిసింది. సమైక్యాంధ్ర ఉధ్యమంలో భాగంగా 66 రోజుల పాటు కౌవల్య తెలుగుతల్లి, భరతమాత, గాందీ, పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు వేషధారణలో అందరినీ ఆకట్టుకుంది. సమైక్యతా రాగాన్ని ఆలపిస్తూ వేషధారణలతో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉన్నతాధికారుల మన్ననలు పొందింది. మనోజ్ఞ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యాక్రమాల్లో వృద్ధులు, అనాథ పిల్లలకు స్వయంగా భోజనాలు వడ్డిస్తూ తన సేవా నిరతిని చాటుకుంటోంది.
నాసా కోర్సు పూర్తి చేసిన కై వల్యరెడ్డి
అమెరికాలో 2023లో నాసా నిర్వహించిన కోర్సును కై వల్యరెడ్డి పూర్తి చేసింది. వ్యామగామి కావడమే లక్ష్యంగా అడుగులు వేసింది. నాసా అందిస్తున్న ఐఏఎస్పీ (ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్) కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎయిర్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ఏటా నవంబర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం (ఐఏఎస్‌పీ) శిక్షణ అందిస్తోంది. విద్యార్థులకు పది రోజుల పాటు వ్యామగామికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 మందికి ఈ అవకాశం లభిస్తుంది. 2023లో భారత్ నుంచి ఎంపికై న వారిలో కై వల్యరెడ్డి ఒకరు. అతి చిన్న వయసులో ఐఏఎస్‌పీకి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న భారతీయురాలిగా రికార్డు సైతం నమోదు చేసింది. శిక్షణలో భాగంగా సొంతంగా విమానం నడపడం, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, జీరో గ్రావిటీ, స్కూబా డైవింగ్ తదితర అంశాలను నేర్చుకుంది.
కైవల్య విజయాలివీ..
గతంలో ఆస్ట్రాయిడ్‌ను గుర్తించి, స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ (న్యూడిల్లీ)అంబాసిడర్ బృంద సభ్యులుగా చిన్నతనంలోనే కైవల్యరెడ్డి ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రానానమికల్ సెర్చ్ కొలాబరేషన్ సహకారంతో నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఆస్ట్రాయిడ్‌ను గుర్తించింది.
చిన్నతనంలోనే కైవల్య అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఆవర్తన పట్టిక 118 మూలకాలను కేవలం నిమిషం 33 సెంకండ్లలో టేబుల్‌పై క్రమపద్ధతిలో అమర్చడం ద్వారా ఈ రికార్డును సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కైవల్యకు ఆర్ట్స్ క్రాప్ట్ విభాగంలో అవార్డు అందజేశారు. ముఖ్యంగా పెదవులతో బొమ్మలు వేయడం, జుట్టుతో బొమ్మలు గీయడం, తోలు బొమ్మల తయారీ, విద్యార్థులకు అర్ధమయ్యెలా ఖగోళశాస్త్రాన్ని బోధించడంతో ఆర్ట్స్ క్రాఫ్ట్ విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది.
జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్థాయిలో 82 దేశాల విద్యార్థులకు నిర్వహించిన ఆన్‌లైన్ ప్రతిభా పోటీలలో ఆమె మూడు రౌండ్‌లలో ప్రతిభ కనబరిచి సిల్వర్ ఆనర్‌ను సాధించింది.
విశాఖలో జరిగిన ప్రపంచ సైన్స్ కాంగ్రెస్‌లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది.
స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ న్యూఢిల్లీ వారు కైవల్యను స్పేస్ అంబాసిడర్‌గా, కమ్యునికేటర్‌గా నియమించారు.
రోడ్లపై తిరుగుతున్న ఆవులు, కుక్కలు, జంతువులను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలా కాపాడాలనే ప్రాజెక్టుకు మద్రాస్‌కు చెందిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ వారు ప్రఽథమ బహుమతిని అందజేశారు.
2019లో తాడేపల్లిగూడెంలో సిరిమువ్వ సోషల్ సర్వీసెస్ అండ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి నృత్య పోటీల్లో ప్రథమ స్థానం సాధించి నాట్య బాల అవార్డు పొందింది.
జాతీయ హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన హిందీ వక్తృత్వ పోటీల్లో జిల్లాలో ప్రధమ స్ధానం సాధించింది.
సాక్షి ఆధ్వర్యంలో స్పెల్‌బీ పోటీలో జిల్లా స్థాయిలో రాణించి హైద్రాబాద్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది.
చాగల్లులో ఇటీవల జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో బంగారు, రజిత పతకాలను కై వసం చేసుకుంది.
నిడదవోలులో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రెండు బంగారు పతకాలను సొంతం చేసుకుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో పాలకొల్లులో నిర్వహించిన గుజోరియో కరాటే చాంపియన్ పోటీల్లో ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించింది.
విజయవాడలో నిర్వహించిన సౌత్ ఇండియా కరాటే చాంపియన్ షిప్ పోటీలలో కటా, కుమిటి విభాగంలో బంగారు పతకాలు సాధించింది.
పెనుగొండలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించింది.
అమరావతిలో నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్‌తో పాటు రెండు బంగారు, రజత పతకాలు సాధించింది.
నిడదవోలులో నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీలలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
చీరాలలో నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది.
ఆమె ఖ్యాతి.. ఖగోళమంత!
ఆమె ఖ్యాతి.. ఖగోళమంత!
ఆమె ఖ్యాతి.. ఖగోళమంత!
ఆమె ఖ్యాతి.. ఖగోళమంత!


