స్క్వాష్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం
బాలాజీచెరువు: అంతర జిల్లాల 69వ ఎస్‌జీఎఫ్ స్క్వాష్ చాంపియన్‌షిఫ్ 2025–26లో భాగంగా అండర్ 14, 17, 19 విభాగంలో బాల, బాలికలకు స్థానిక డీఎస్‌ఏ గ్రౌండ్స్‌లో శుక్రవారం పోటీలు మొదలయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ.. జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ ఇండోర్ గేమ్ గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుందని, శక్తి సమన్వయాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో సతీష్ కుమార్, స్వ్కాష్ కోచ్ లక్ష్మణ్, జుడో కోచ్ తేజ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మెహబూబ్ బాషా, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ సుధారాణి, కె.శ్రీనివాస్, హాకీ కోచ్ రవిరాజ్, వివిధ జిల్లాల పీడీలు పాల్గొన్నారు.
బెలూన్లు ఎగురవేసి పోటీలను ప్రారంభిస్తున్న అతిథులు


