సత్యదేవా.. చూడవయ్యా.. | - | Sakshi
Sakshi News home page

సత్యదేవా.. చూడవయ్యా..

Nov 8 2025 7:24 AM | Updated on Nov 8 2025 7:24 AM

సత్యద

సత్యదేవా.. చూడవయ్యా..

భార్యపై కత్తితో దాడి

గోపాలపురం: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశా డు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై పి.మనోహర్‌ తెలిపిన వివరాల ప్రకా రం గోపాలపురం మండలం దొండపూడికి చెందిన కాసాని సింధుజ, రామకృష్ణ భార్యభర్తలు. కాగా.. భార్యపై రామకృష్ణకు అనుమా నం కలిగింది. దీంతో గురువారం అర్ధరాత్రి మద్యం మత్తులో కత్తితో ఆమైపె దాడి చేశారు. ఈ ఘటనలో సింధుజ ముఖంపై తీవ్ర గాయమైంది. ఆమెను కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ మేరకు రామకృష్ణపై హత్యాయత్నం కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. రేషన్‌ బియ్యం స్వాధీనం

నల్లజర్ల: ఏలూరు నుంచి కాకినాడ పోర్టుకు అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు టన్నుల రేషన్‌ బియ్యాన్ని శుక్రవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపల్లి శివారు టోల్‌ప్లాజా వద్ద సివిల్‌ సప్లయిస్‌, విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా రెండు మినీ వ్యాన్లలో రవాణా అవుతున్న ఈ బియ్యాన్ని గుర్తించారు. నిందితులపై 6ఏ, 7 కేసులు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని గోపాలపురం సివిల్‌ సప్లయి గోదాముకు తరలించినట్టు సీఎస్‌ డీటీ సత్యనారాయణరావు తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్‌ సీఐ మధుబాబు సిబ్బంది పాల్గొన్నారు.

అన్నవరంలో గిరి ప్రదక్షిణ విజయవంతం

కానీ భక్తులకు కొన్ని ఇబ్బందులు

వచ్చే ఏడాదికై నా పరిష్కరించాలని వినతి

అన్నవరం: రత్నగిరి కొలువైన వీర వేంకట సత్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తారు. స్వామివారి వ్రతం ఆచరించి, సత్యదేవుని దర్శించుకుని, రావిచెట్టుకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక పండగలు, ప్రత్యేకమైన రోజుల్లో భారీగా పోటెత్తుతారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న జరిగిన గిరి ప్రదక్షిణకు సుమారు మూడు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఆ రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అయితే గిరి ప్రదక్షిణలో మాత్రం భక్తులు కొన్ని ఇబ్బందులు పడ్డాయి. వాటి పరిష్కారం దిశగా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సమన్వయంతో..

గిరి ప్రదక్షిణ విజయవంతం కావడంతో దేవదాయశాఖ ఉన్నతాధికారులు, అన్నవరం దేవస్థానం అధికారులు, పోలీసులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ, ఏకాదశి నాడు కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో అందరూ అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా దేవదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కాకినాడ డీసీ రమేష్‌ బాబు, లోవ, వాడపల్లి దేవస్థానాల ఈఓలు విశ్వనాథరాజు, చక్రధరరావులను ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించారు. రాజమహేంద్రవరం ఆర్‌జేసీ త్రినాథరావును గిరి ప్రదక్షిణ, కార్తిక పౌర్ణిమ ఏర్పాట్ల ప్రత్యేకాధికారిగా నియమించారు. అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావును రత్నగిరిపై ఏర్పాట్లు చూడాలని, కొండ దిగువన దేవదాయశాఖ అధికారులు చూడాలని ఆదేశాలిచ్చారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ కార్తిక మాసం ప్రారంభం నుంచే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అందరి సమన్వయం, సహకారంతో గిరి ప్రదక్షిణ విజయవంతమైంది.

సమస్యలు ఇవే..

● గిరి ప్రదక్షిణ జరిగే పుష్కర కాలువ రోడ్డు దారుణంగా ఉంది. దీనిపై ఉన్న గులకరాళ్ల వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే గిరి ప్రదక్షిణ సమయానికి ఇక్కడ బీటీ రోడ్డు లేదా సిమెంట్‌ రోడ్డు నిర్మించాలి. దేవస్థానం, అటవీశాఖ సంయుక్తంగా ఈ రోడ్డుకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు పెంచాలి. ఆ పని ఇప్పుడే ప్రారంభిస్తే వచ్చే ఏడాదికి అవి పెరిగి గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులకు నీడనిస్తాయి.

● గిరి ప్రదక్షిణ రోజు సుమారు పది కిలోమీటర్ల ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అక్కడ ఆగిపోయిన వందల వాహనాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి పరిష్కారం ఆలోచించాలి.

● గిరి ప్రదక్షిణ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఆర్టీసీ బస్సులను అన్నవరం గ్రామంలోకి అనుమతించడం లేదు. ఆటోలదీ అదే పరిస్థితి. దీని వల్ల ఆ రోజు సత్యదేవుని ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం కనీసం రెండు కిలోమీటర్లు హైవే వరకూ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

● ఇలాంటి సమయంలో జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం వైపు వెళ్లే భక్తుల కోసం సత్యదేవుని నూతన నమూనా ఆలయం వద్ద, విశాఖపట్నం వైపు వెళ్లే భక్తుల కోసం మరో ఖాళీ ప్రదేశంలో బస్సులు ఆగేలా చూడాలి. అక్కడ వరకూ భక్తులను ఆటోలు, లేదా దేవస్థానం బస్సుల ద్వారా తరలించాలి. దీని కోసం అన్నవరం రైల్వేస్టేషన్‌ రోడ్డు నుంచి హైవే వరకూ గల జన్మభూమి రోడ్డును ఉపయోగించుకోవాలి. అవసరమైతే ఆ రోడ్డును ఇంకా విశాలం చేయాలి.

● వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు జరిగే సత్యదేవుని కల్యాణం సమయంలో గ్రామంలో మద్యం షాపులను మూసేస్తారు. ఆ ఉత్సవాలు నిర్వహించే ఐదు రోజులూ రాత్రి వేళలో కూడా స్వామివారి ఊరేగింపు సమయాలలో ఆ షాపులను బంద్‌ చేస్తారు. కానీ మూడు లక్షల మంది భక్తులు వచ్చిన గిరి ప్రదక్షిణ రోజు మాత్రం ఈ షాపులు తెరిచి యఽథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగించారు.

బాలికను మోసగించిన యువకుడి అరెస్ట్‌

కొత్తపల్లి: బాలికను ప్రేమ పేరుతో మోసగించి, శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు పిఠాపురం సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. అమీనాబాద్‌ గ్రామానికి చెందిన బాలికతో అదే గ్రామానికి చెందిన కోడా అంజిబాబు గతేడాదిగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. 2025 ఫిబ్రవరిలో ఆమె కుటుంబ సబ్యులు లేని సమయంలో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. బాలిక గర్భవతి కావడంతో అబార్షన్‌ మాత్రలు ఇచ్చి, గర్భాన్ని విచ్చిన్నం చేయించాడు. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అంజిబాబును అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్సై వెంకటేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

బంగారు పతకాలు సాధించిన

అక్కాచెల్లెళ్లు

సామర్లకోట: వేట్లపాలెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చెందిన దాసరి సుదీష్ట, దాసరి హరిక అనే అక్కా చెల్లెళ్లు రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. ఈ విషయాన్ని ఆ పాఠశాల పిజకల్‌ డైరెక్టర్‌ యార్లగడ్డ బంగార్రాజు శుక్రవారం స్థానిక విలేకర్లకు తెలిపారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకూ కృష్ణా జిల్లాలో జరిగిన పోటీల్లో అండర్‌ – 14 విభాగం నుంచి సుదీష్ట, అండర్‌ 17 విభాగం నుంచి దాసరి హరిక బంగారు పతకం గెలుచుకున్నారు.

దీంతో ఉత్తర్‌ ప్రదేశ్‌లో డిసెంబర్‌ 8 నుంచి 12 వరకు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కాగా.. అన్నాచెల్లెళ్లను ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, పాఠశాల హెచ్‌ఎం పి. అనురాధ, సర్పంచ్‌ చిల్లి వెంకటలక్ష్మీ, ఉపసర్పంచ్‌ గోలి శ్రీరామ్‌లు అభినందించారు.

07పీటీపీ46,47:

బంగారు పతకం సాధించిన హరిక, సుదీష్ట

సత్యదేవా.. చూడవయ్యా.. 1
1/3

సత్యదేవా.. చూడవయ్యా..

సత్యదేవా.. చూడవయ్యా.. 2
2/3

సత్యదేవా.. చూడవయ్యా..

సత్యదేవా.. చూడవయ్యా.. 3
3/3

సత్యదేవా.. చూడవయ్యా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement