దేశభక్తిని పెంపొందించిన వందేమాతరం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వందేమాతరం గేయం భారతీయుల్లో దేశభక్తిని పెంపొందించిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. ఆ గేయానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవా రం కాకినాడ జెడ్పీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ వి.వేణుగోపాలరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, ఇతర సిబ్బంది వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఆ గేయ రచయిత బంకించంద్ర చటర్జీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


