ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
బాలాజీచెరువు: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట సోమవారం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఆందోళనకారులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.6,400 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయని, దీంతో పరీక్ష ఫీజు సైతం కళాశాలలు కట్టించుకోవడం లేదన్నారు. నేటితో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫీజు చివరి తేదీ అని జేఎన్‌టీయూకే ప్రకటించిందని, విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, నగర అధ్యక్షుడు వాసుదేవ్, నాయకులు జయరాం, కరిష్మా, శశిప్రియ, శీరిష, దుర్గాప్రసాద్, వివేక్ పాల్గొన్నారు.
కారు డ్రైవర్ అదృశ్యం
అమలాపురం టౌన్: కొంకాపల్లికి చెందిన కారు డ్రైవర్ కంచిపల్లి శ్రీనివాస్ అదృశ్యమైనట్టు అతని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు తెలుపు రంగు సుజుకి యాక్సెస్ స్కూటీపై రాజమహేంద్రవరం వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో అతని ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. దీంతో అతని కుటుంబీకులు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. శ్రీనివాస్ ఆచూకీ తెలిసిన వారు డయల్ 112కి లేదా పట్టణ సీఐ 94407 96561, ఎస్సై 98481 32305 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ వీరబాబు తెలిపారు.
కాలువలో పడి వ్యక్తి మృతి
తాళ్లరేవు: మండల పరిధిలోని లచ్చిపాలెం గ్రామానికి చెందిన కొండేపూడి గోవిందు(43) ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెందాడు. గోవిందు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 25వ తేదీన గోవిందు స్థానిక బ్యాంక్ కెనాల్‌లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో గల్లంతయ్యాడని, గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం కేంద్రపాలిత ప్రాంతమైన యానాం దరియాలతిప్పలో మృతదేహం లభించిందన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేకాడుతున్న 18 మంది అరెస్టు
రావులపాలెం: రెండు వేర్వేరు ప్రాంతాల్లో పేకాడుతున్న జూదరులను సోమవారం రాత్రి రావులపాలెం పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. మండలంలోని వెదిరేశ్వరం గ్రామంలో ఒక ఇంటిలో పేకాడుతున్న సీఐ శేఖర్‌బాబుకు అందిన సమాచారంతో దాడి చేసి 10 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.25,070 నగదు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక బండిరేవు పుంతలో పేకాడుతున్న మరో ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,305 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు.
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 30,000
గటగట (వెయ్యి) 28,000
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా


