తుపాను నేపథ్యంలో పలు రైళ్ల రద్దు
రాజమహేంద్రవరం సిటీ: తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను మంగళవారం రద్దు చేసినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. తిరుపతి– విశాఖపట్నం(08584), మహబూబ్‌నగర్– విశాఖపట్నం (12862), చైన్నె– విశాఖపట్నం స్పెషల్ (22802), రాజమహేంద్రవరం– విశాఖపట్నం(67286), భువనేశ్వర్ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (18463), భువనేశ్వర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17015), భువనేశ్వర్ –పాండిచ్చేరి (20851) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులకు టికెట్ పూర్తి మొత్తాన్ని అందించేందుకు అవసరమైన కౌంటర్లను స్టేషన్‌లో ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 24 గంటలు అందుబాటులో ఉండేలా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు రైల్వే స్టేషన్ సీటీఐ సుంకర చంద్రమౌళి తెలిపారు. ప్రయాణికులు రైళ్ల రాకపోకల వివరాలను తెలుసుకునేందుకు 83319 87657 నంబర్‌లో సంప్రదించాలన్నారు.


