జాకీలతో ఇంటి ఎత్తు పెంపు
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం మారేడుబాక మహిళా నగర్‌లోని ఓ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించింది. కొన్నేళ్లుగా పల్లంలో ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు మూడు అడుగుల ఎత్తుకు పెరిగింది. సాధారణంగా ఇల్లు అనుకూలంగా లేకపోతే కూల్చి మళ్లీ కడతారు. ఇక్కడ ఇల్లు కూల్చకుండానే ఎత్తు చేశారు. పల్లంలో ఉంటున్న ఇంట్లో నివసించడానికి ఇబ్బందిగా భావించిన యజమాని మోటుపల్లి వీరగణేష్.. ఆ ఇంటిని కూల్చే సాహసం చేయలేకపోయారు. ఇంటిని ఎత్తు చేసేలా ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. జాకీల సాయంతో ఇంటి ఎత్తు పెంచే విజయవాడలోని ఓ సంస్థ ప్రతినిధులను సంప్రదించారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మూడు అడుగులు ఎత్తు చేయవచ్చంటూ సంస్థ ప్రతినిధులు భరోసా ఇచ్చారు. అందుకయ్యే ఖర్చును చెల్లించేందుకు యజమాని సిద్ధపడటంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, జాకీలతో ఇంటిని మూడు అడుగుల ఎత్తు పెంచారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ పూర్తికావడంతో అనుబంధ పనులను చేస్తున్నారు.


