
ఏపీని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు
తుని రూరల్: కూటమి పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, దుర్మార్గమైన పరిపాలన సాగుతోందని, లైంగిక దాడులు, హత్యలు, డ్రగ్స్ పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్సీ అంగుళూరి శివకుమారి ఆరోపించారు. తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో లైంగిక దాడి యత్నానికి గురైన బాధిత బాలికను వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, జిల్లా ప్రధాన కార్యదర్శి రాయి మేరీ అవినాష్‌తో కలసి బుధవారం మాజీ ఎమ్మెల్సీ శివకుమారి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళితులపై, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించరు, మాట్లాడరని మండిపడ్డారు. పాయకరావుపేట, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారని, పిఠాపురంలో డిప్యూటీ సీఎం ఉన్నారని, ఈ ప్రాంతంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అయినప్పటికీ ఈ దారుణంపై ఎవ్వరూ స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకువెళ్తోందో చెప్పాలన్నారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు న్యాయం చేయాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుంటుందో ప్రకటించాలని, పాఠశాల నిర్వహకులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫ రాష్ట్రంలో దుర్మార్గమైన
పరిపాలన సాగుతోంది
ఫ లైంగిక దాడులు,
హత్యలు, డ్రగ్స్ పెరిగిపోయాయి
ఫ అయినా హోం మంత్రి స్పందించరు
ఫ మాజీ ఎమ్మెల్సీ శివకుమారి ఆగ్రహం
ఫ బాధిత బాలికకు పరామర్శ