కక్ష సాధింపే.. | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపే..

Oct 23 2025 2:19 AM | Updated on Oct 23 2025 2:19 AM

కక్ష

కక్ష సాధింపే..

‘సాక్షి’ దిన పత్రిక, ఎడిటర్‌, విలేకర్లపై పోలీసులు కక్ష సాధింపుతోనే వేధిస్తున్నారు. నకిలీ మద్యం వార్తలను జీర్ణించుకోలేకే కూటమి ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. ‘సాక్షి’ రాసే వార్తల వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులుంటే ఖండనలు లేదా వివరణలు ఇచ్చుకోవాలే తప్ప ఇలా పత్రిక ప్రధాన కార్యాలయానికి పోలీసులను పంపించి వేధించడం సబబు కాదు. ముఖ్యంగా ‘సాక్షి’ ఎడిటర్‌ ధనంజయరెడ్డిని, ఆయన స్థాయి, విలువను గుర్తించకుండా పోలీసులు కేసులు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం దారుణం. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ‘సాక్షి’పై ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయి. – పినిపే విశ్వరూప్‌, మాజీ మంత్రి, అమలాపురం

పైశాచికత్వానికి పరాకాష్ట

‘సాక్షి’ దినపత్రికపై దాడి ప్రభుత్వ పైచాచికత్వానికి పరాకాష్ట. ‘సాక్షి’ పట్ల, పత్రిక ఎడిటర్‌ పట్ల కూటమి ప్రభుత్వం, దాని తరఫున పోలీసు అధికారులు దాడులు, బెదిరింపులకు దిగడం వాస్తవాలపై, ప్రజలపై దాడి చేయడమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఈ సంస్కృతి సరి కాదు. ప్రజాస్వామ్యవాదులు అక్రమ కేసులను ఖండించాలి. ప్రభుత్వ దమన నీతిపై ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం కోసం పత్రికా స్వేచ్ఛను కాపాడాలి.

– చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొత్తపేట, వైఎస్సార్‌ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు

కక్ష సాధింపే.. 
1
1/2

కక్ష సాధింపే..

కక్ష సాధింపే.. 
2
2/2

కక్ష సాధింపే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement