
ఇక మౌనం సాధ్యం కాదు
ఇక మౌనం సాధ్యం కాదు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, నర్సులు, సిబ్బంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆలస్యంగా జరుగుతోన్న చెల్లింపుల్లో మార్పులు రావాలి. ప్యాకేజీ రివిజన్ వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇది ఆరోగ్య రంగం నిలదొక్కుకునే స్థితినే ప్రమాదంలోకి నెట్టేస్తున్న పరిస్థితులపై పోరాటం మాత్రమే. పెండింగ్ బకాయిలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ఏడాది కాలంగా నెట్‌వర్క్ ఆస్పత్రులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇంత కాలం సేవలందించిన మాకు ఈ కష్ట కాలంలో అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నాం.
– డాక్టర్ వై.కల్యాణ్ చక్రవర్తి, కో ఆర్డినేటర్, ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా), కాకినాడ