
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే..
పత్రికలకు భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు భంగం కలిగించేలా కూటమి ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా అణచివేత ధోరణి అవలంబించడం సమంజసం కాదు. పత్రికల స్వేచ్ఛను హరించడానికి, హక్కులను నిర్మూలించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారు శిక్షార్హులు కూడా. పత్రికా స్వాతంత్య్రం అణచివేతకు ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి.
– పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాజ్యసభ సభ్యుడు
కేసులు ఉపసంహరించాలి
పత్రికలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను హరించేలా కొత్త సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెర తీసింది. ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఆ పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోంది. పత్రిక కార్యాలయంపై దాడులు తగవు. పత్రికలకు గౌరవం ఇవ్వాలి. కేసులు ఉపసంహరించాలి.
– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, కాకినాడ జిల్లా

బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025