
వానోస్తే ముంపే..
ఆటోనగర్‌లో మెకానిక్ షెడ్ల నిర్వాహకులం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వానొస్తే ముంపు తప్పడం లేదు. విలువైన సామగ్రి, ఇంజిన్లు చెడిపోతున్నాయి. రోడ్లు, మౌలిక సదుపాయాలు లేవు. – మణికంఠ
● శాశ్వత పరిష్కారం చూపాలి
ఆటోనగర్‌లో చాలా సమస్యలున్నాయి. రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేవు. ముఖ్యంగా వర్షాలకు ముంపులోకి వెళ్లడంతో పనులు నిలిచిపోతున్నాయి. ఉపాధి దెబ్బ తింటోంది. ఏపీఐఐసీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.
– సతీష్
రూ.2.50 కోట్లతో డ్రైనేజీకి ప్రతిపాదన
ఆటోనగర్ పల్లపు ప్రాంతంగా మారింది. పంట పొలాలను ఆనుకుని ఉండటంతో వర్షాలకు నీరు బయటకు పోవడం లేదు. పంట పొలాల్లోని గోదావరి, ఏలేరు జలాలు ఆటోనగర్ ఇండస్ట్రియల్ పార్కులోకి వస్తున్నాయి. పలు షాపుల్లోకి నీరు చేరడంతో పాటు వీధులు మునిగిపోయి ముంపులో ఉంటున్నాయి. సమస్య పరిష్కారానికి రూ.2.50 కోట్లతో మేజర్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం.
– అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, కాకినాడ

వానోస్తే ముంపే..