
బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక మంగళవారం స్థానిక రా మారావుపేటలో జరిగింది. ప్రస్తు త జిల్లా అధ్యక్షుడు రామానుజన్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా వాసంశెట్టి కామేశ్వరరావు (వి ద్యాశాఖ), గౌరవాధ్యక్షుడిగా రామానుజన్ శ్రీనివాస్ (విద్యుత్ శాఖ), ప్రధాన కార్యదర్శిగా జోగా రామకృష్ణ (వైద్య, ఆరోగ్య శాఖ), ఆర్థిక కార్యదర్శిగా నరసింహమూర్తి (విద్యా శాఖ), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా గంటి రాధాకృష్ణ, కాకినాడ పట్టణ శాఖ గౌరవాధ్యక్షుడిగా చోడే శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సంగాడి రాజసింహవర్మ, అధ్యక్షుడిగా కడలి నాగరాజు, ప్రధా న కార్యదర్శి ముక్తేష్, సంయుక్త కార్యదర్శిగా ములంపాక శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి, సంఘాన్ని బలోపేతం చేస్తా నని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధి వెంకటేశ్వరరావు, అద్దంకి వెంకన్నబాబు, ముల్లు సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు దొమ్మేటి సుధాకర్, రాపాక శ్రీనివా స్, వీరభద్రరావు, డి.ఏడుకొండలు, టేకుమూడి శ్రీనివాస్, సత్యప్రసాద్, గుత్తుల వెంకటేష్ పాల్గొన్నారు.