దెబ్బ తిన్న యంత్రాలు
వివిధ యూనిట్లలోని యంత్రాల్లోకి ముంపు నీరు చేరి రోజుల తరబడి నిలిచిపోవడంతో ఆ యంత్రాలు ఇక పని చేయవేమోనని యజమానులు దిగులు చెందుతున్నారు. ఇక్కడ తయారయ్యే ట్రాన్స్‌ఫార్మర్లు, వెల్డింగ్ మెషీన్లు, ప్యానల్ బోర్డులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వెళ్తూంటాయి. అప్పుడే నాలుగైదు రోజులుగా పనులు నిలిచిపోవడంతో రూ.లక్షల్లో నష్టపోతున్నామని వారు మధనపడుతున్నారు. వెల్డింగ్ మెషీన్లు, ఒక మోస్తరు యంత్ర పరికరాలు ముంపులో ఉండటంతో నీరు లాగేసినా తిరిగి అవి పని చేస్తాయో లేవోననే దిగులు వారిని వెంటాడుతోంది.


