
రాష్ట్ర బ్లిట్జ్ చెస్ చాంపియన్‌గా సాత్విక్
అమలాపురం టౌన్: ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో జరిగిన రాష్ట్ర ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ పోటీల్లో అమలాపురం విక్టరీ అకాడమీకి చెందిన ద్రాక్షారపు సాత్విక్ ప్రథమ స్థానం సాధించాడని జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీల్లో 140 మంది క్రీడాకారులు పాల్గొనగా సాత్విక్ బ్లిట్జ్ చెస్‌లో 7 రౌండ్లకు 6.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. త్వరలో త్రిపుర రాష్ట్రంలో జరగనున్న నేషనల్ బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో సాత్విక్ మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించనున్నాడు. నంద్యాలలో చాంపియన్ షిప్ నిర్వాహకుల నుంచి విజేత సాత్విక్ రాష్ట్ర బ్లిట్జ్ చెస్ చాంపియన్‌గా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నాడు. రాష్ట్ర విజేత సాత్విక్‌ను రాష్ట్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కవురు జగదీష్, జిల్లా అసోసియేషన్ సెక్రటరీ వెంకట సురేష్ అభినందించారు.