
పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఆదాయం తక్కువ ఉన్న మసీదుల్లో పని చేస్తున్న ఇమామ్, మౌజన్‌లకు ఇవ్వాల్సిన 11 నెలల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ ముస్లిం విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎస్‌కే కరీంబాషా డిమాండ్ చేశారు. ముస్లిం విభాగం కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి బాషా అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రతి నెలా మౌజన్, ఇమామ్‌లకు గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ కొన్ని నెలలుగా గౌరవ వేతనం అందించలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2024 మార్చి వరకు గౌరవ వేతనాలు మంజూరు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం నాలుగు నెలలు మాత్రమే వేతనాలు చెల్లించిందన్నారు. పార్టీ ముస్లిం విభాగం సిటీ అధ్యక్షుడు కాలిద్ బిన్ వాలిద్, మాజీ వాక్స్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు రెహమాన్ ఖాన్, హేమంత్, మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు అజ్జు, మయూరి అలీషా, చాంద్ భాషా, ఇర్ఫాన్, నౌషద్, కిషోర్ పాల్గొన్నారు.