
రైతుపోరుకు తరలి రండి
యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటోన్న కష్టాలను కూటమి సర్కార్ దృష్టికి తీసుకువెళ్లేలా మంగళవారం ఆర్డీఓ కార్యాలయాల వద్ద తలపెట్టిన రైతు పోరు కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా కేంద్రం కాకినాడ ఆర్డీఒ, పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందచేయనున్నారు. పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి ఆ డివిజన్ పరిధిలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం నియోజకవర్గాలకు చెందిన పార్టీ కోఆర్డినేటర్‌లు, పార్టీ నేతలు, శ్రేణులు, రైతులు కలిసి వెళ్లనున్నారు. ఇక్కడి కార్యక్రమానికి వైఎస్సార్ సీపీజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నిర్వహించేలా నిర్ణయించారు. కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో విజ్ఞాపన అందచేసే కార్యక్రమానికి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్‌లు, పార్టీ నేతలు, రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ పిఠాపురం కోఆర్డినేటర్, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీత విజ్ఞప్తి చేశారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజా