
శిథిలాకులు!
లాకులన్నీ లీకులే..
సాగునీటి సరఫరాలో అత్యంత ప్రధానమైన రెగ్యులేటర్లు, స్లూయిజ్‌లు మరమ్మతులకు గురై శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. సాధారణంగా సాగునీటి కాలువల్లో నీటి ప్రవాహం సక్రమంగా జరగడానికి రెగ్యులేటర్లు కీలక పాత్ర వహిస్తుంటాయి. అన్ని ప్రాంతాలకు సాగు నీరు సక్రమంగా సరఫరా చేయడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. అలాంటి రెగ్యులేటర్లు కొన్నేళ్లుగా మరమ్మతులకు గురై శిథిలావస్థలో ఉన్నా అధికారులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గొల్లప్రోలు మండలం మల్లవరం ఆర్‌ఆర్‌బీ ట్యాంకు రెగ్యులేటర్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. రెగ్యులేటర్ గోడలు శిథిలమై కూలిపోతున్నాయి. షట్టర్లు తుప్పుపట్టి ముక్కలవుతున్నాయి. దీంతో అది పూర్తిగా నిరుపయోగంగా మారింది. 1400 ఎకరాల చెరువుకు నిర్మించిన ఈ రెగ్యులేటర్ గట్టిగా వరద నీరు వస్తే ఏక్షణంలోనైనా కొట్టుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వేల ఎకరాల పంటలు నీటిలో కొట్టుకుపోయి, గ్రామాలకు గ్రామాలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది.
పిఠాపురం: నియోజకవర్గంలో సాగునీటి వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఏలేరు, పీబీసీ ఆయకట్టు ప్రాంతం అత్యంత ప్రమాదకర స్థితిలో సాగవుతోంది. వరితో పాటు వాణిజ్య పంటలకు పెట్టిందిపేరైన నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏటా అతివృష్టి అనావృష్టి సమయాల్లో ఇక్కడి రైతులు తమ పంటలను కోల్పోవాల్సి వస్తోంది. అయినప్పటికీ పాలకులు చర్యలు తీసుకోవడం లేదు.
అధికారుల నిర్లక్ష్యంతో లీకులు
కొట్టుకుపోతున్న
రెగ్యులేటర్లు, స్లూయిజ్‌లు, సైఫన్లు
పీబీసీ, ఏలేరు ఆయకట్టుకు
సాగునీటి ఇక్కట్లు

శిథిలాకులు!