
కాసూ కాసూ కలిపి కంఠాభరణం
కరెన్సీ కన్యకాంబ
శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్బంగా స్థానిక మెయిన్‌రోడ్‌లో కొలువైన వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని రూ.3 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ.వంద, రూ.200, రూ.500 నోట్లతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.
– అన్నవరం
పుత్తడి బాలమ్మ..
శ్రావణ శుక్రవారం సందర్భంగా కాకినాడ సూర్యారావుపేటలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారు బంగారు చీరలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు చెరుకూరి సుబ్రహ్మణ్యం అమ్మవారికి అత్యంత సుందరంగా చీర అలంకరించారు. ఆ చీరలో అమ్మవారు అద్వితీయంగా ప్రకాశిస్తూ కాంతులీనారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
– బోట్‌క్లబ్
జె.కొత్తూరులో గ్రామ దేవత కనక దుర్గ అమ్మవారికి రూ.5.5 లక్షల విలువైన బంగారు ఆభరణాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన చిన్న చిన్న బంగారు వస్తువులన్నింటినీ కరిగించి అమ్మవారికి బంగారు హారం తయారు చేయించినట్టు కమిటీ సభ్యులు వివరించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ హారాన్ని అమ్మవారికి అలంకరించినట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రముఖులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
– జగ్గంపేట

కాసూ కాసూ కలిపి కంఠాభరణం

కాసూ కాసూ కలిపి కంఠాభరణం