
తీరంలో అలజడి
● తీరప్రాంతంలోనికి చొచ్చుకు వస్తున్న నీరు ● కోతకు గురవుతున్న ఇళ్లు, రోడ్లు
కొత్తపల్లి: రెండు రోజులుగా తీరప్రాంతంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీరప్రాంతంతో పాటు మత్స్యకారుల ఇళ్లు కోతకు గురవుతున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగసి పడడంతో నీరు గ్రామంలోకి చొచ్చుకువస్తోంది. దీంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన పంచాయతీ అధికారులు గ్రామంలో నీరు నిలువలేకుండా కచ్చా డ్రైన్లు తువ్వుతున్నారు. ఎటువంటి తుపాన్ హెచ్చరికలు లేకపోయినా అలలు ఉధృతంగా మారడంతో తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాలలో కాకినాడ–ఉప్పాడ బీచ్‌రోడ్డులో సముద్రపు అలలు ఎగసి పడడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

తీరంలో అలజడి

తీరంలో అలజడి