
రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో పాలన గాడితప్పి ఎమెర్జెన్సీ నడుస్తోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ విమర్శించారు. కక్ష సాధింపులతో కూటమి పాలన సాగుతోందన్నారు.
బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎకై ్సజ్‌శాఖకు ఎటువంటి సంబంధం లేకున్నా అన్యాయంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు, బలవంతపు ఒప్పందాలు, అధికార దుర్వినియోగం ద్వారా కేసులు నమోదుచేయడం కుట్ర కోణాన్ని చెప్పకనే చెబుతోందన్నారు. మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. తప్పుడు కేసులో ఇరికించి ఇరుకున పెట్టడం చాలా బాధాకరమన్నారు. 2014–19లో మద్యం మాఫియా నడిచిందని, ఇప్పుడు కూడా అదే సాగుతోందని రాష్ట్రం కోడైకూస్తోందన్నారు. రాష్ట్రంలో 4380 లిక్కర్ షాపులు, 43 వేల బెల్ట్‌షాపులు, పర్మిట్ రూమ్‌లు ప్రైవేటు మాఫియాకు అప్పగించారన్నారు. ఇటువంటి వాస్తవాలు అన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు ఇప్పటికై నా కూటమి సర్కార్ స్వస్తి పలికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని విప్పర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడటం సమంజసం కాదన్నారు.
కక్షపూరిత పాలనకు స్వస్తి పలకండి
జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు