
కొత్త కార్యవర్గం ఎన్నిక
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ఎస్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘ నూతన కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా 2025– 27 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా ప్రధానోపాధ్యాయుల సంఘ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి చెవ్వూరి రవి హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కేవీ రమణారావు, ప్రధాన కార్యదర్శిగా ఐ.పంగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంగిన శ్రీరామారావు, ఆర్థిక కార్యదర్శిగా పల్లి రాజు, రాష్ట్ర కౌన్సిలర్లుగా కోలా సత్యనారాయణ, జి.గణపతిరావు, కె.ఫణిశేఖర్, ఉపాధ్యక్షులుగా ఆర్.విజయదుర్గ, ఎం.చిమ్మరాజుదొర, జాయింట్ సెక్రటరీలుగా జేవీ శ్రీనివాస్, పి.వెంకట్‌రెడ్డి, మహిళా కార్యదర్శిగా జి.ప్రమీలరాణి, సీహెచ్ సుబ్బలకి్‌ష్మ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గ సభ్యులతో ఎన్నికల పరిశీలకుడు చెవ్వూరి రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులపై ఉన్నతాధికారులు పని ఒత్తిడి పెంచుతున్నారని, సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల 15 ఏళ్ల నుంచి ఎటువంటి ప్రమోషన్లు లేకుండా ఉద్యోగ విరమణ చేస్తున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలన్నారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తుని: రైలు నుంచి జారిపడి మహారాష్ట్ర వాసి గురువారం మృతి చెందాడు. ఆ వివరాల్లోకెళితే.. మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా, రీసంగాన్ గ్రామానికి చెందిన పరమేశ్వర్ పాండురంగ్ వవర్ (45) లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. నాందేడ్ నుంచి లారీపై అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి లోడ్ తీసుకొచ్చాడు. లారీని డ్రైవర్‌కు అప్పగించి తిరుగు ప్రయాణంలో భాగంగా నాందేడ్ వెళ్లేందుకు యలమంచిలిలో రైలు ఎక్కాడు. నర్సీపట్నం రోడ్డు, గుల్లిపాడు రైల్వే స్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.

కొత్త కార్యవర్గం ఎన్నిక