
ఆ బండరాళ్లు పేలుళ్ల వల్ల పడలేదు
తుని రూరల్: మండలం కుమ్మరిలోవ సమీపంలో జరుగుతున్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను కలెక్టర్ షణ్మోహన్ పర్యవేక్షించారు. బుధవారం తుని వచ్చిన ఆయన ఇటీవల ఒకటో వార్డులో బండరాళ్లు పడిన ఘటన వివరాలను అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్లపై పడిన పేలుళ్ల వల్ల పడలేదని, ఆ కంపనాలకు కొండపై నుంచి పడ్డాయని తెలిపారు. అనంతరం ఆయన తాండవ నదిపై నిర్మిస్తున్న అక్విడెక్ట్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 12 ఏళ్లుగా నిలిచిపోయిన పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనులు కాలనీవాసుల సహకారంతో శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 35 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగా మరో 60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉందన్నారు. ఇక్కడి నిర్వాసితుల సమస్యలను రెండు వారాల్లో పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, పోలవరం ఇరిగేషన్ ఈఈ గోవిందు, డీఈ మురళి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ కె.సాయినవీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆ కంపనాలకు కొండపై
రాళ్లు దొర్లి ఇళ్లపై పడ్డాయి
రెండు వారాల్లో నిర్వాసితుల
సమస్యలకు పరిష్కారం
పోలవరం కాలువ పనులను
పర్యవేక్షించిన కలెక్టర్ షణ్మోహన్