
అచ్చెన్న వ్యాఖ్యలు అన్యాయం
ఆడబిడ్డ నిధిపై బాధ్యతాయుతమైన మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు అన్యాయం. ఆ పథకం అమలుచేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని ఎలా అంటారు? రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందో లెక్కా పత్రం లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారు? అంటే ప్రజలను నిలువునా వంచన చేసి ఓట్లు వేయించుకోవడం కాదా? అధికారంలోకి వచ్చేశామనే ధైర్యంతో ఇప్పుడు ఇలా మాట్లాడతారా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు.
– రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్,
వైఎస్సార్ సీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి.
కౌడా మాజీ చైర్‌పర్సన్. కాకినాడ
ఆడబిడ్డకు అన్యాయం చేస్తారా?
అధికారంలోకి వచ్చీ రాగానే ఆడబిడ్డ పథకాన్ని అమలు చేస్తామన్నారు. 2024 జూన్ నుంచే కమ్రం తప్పకుండా పేద మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000 ఇస్తామని బాబు, పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇలా వారి కేబినెట్‌లో ఒక మంత్రితో ఇలా మాట్లాడించడం మహిళలను మోసం చేయడమే. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తు గ్యారంటీ’ పేరిట ప్రజలకు అందించిన బాండ్లలో సైతం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయంపై మహిళలకు సమాధానం చెప్పాల్సిందే.
– సుంకర శివప్రసన్నవిద్యాసాగర్.
వైఎస్సార్ సీపీ సిటీ అధ్యక్షురాలు,
మాజీ మేయర్, కాకినాడ

అచ్చెన్న వ్యాఖ్యలు అన్యాయం