నడిసంద్రాన సాపాట్లు | - | Sakshi
Sakshi News home page

నడిసంద్రాన సాపాట్లు

Jul 24 2025 7:16 AM | Updated on Jul 24 2025 7:16 AM

నడిసం

నడిసంద్రాన సాపాట్లు

శ్రావణంలో రత్నగిరికి కొత్త శోభ

చేపల రుచులు చేదెక్కాయి. సాగర గర్భంలో పర్యావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండడంతో మత్స్య సంపదకు ముప్పు ఏర్పడుతోంది. ఈ క్రమంలో పాటు లేక.. పూట గడవని మత్స్యకారులు వలసబాట పడుతున్నారు. ప్రభుత్వ విధానాలు, పెరిగిన డీజిల్‌ ధరలు వెరసి మత్స్యకారుల జీవన విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను, తమ డిమాండ్లను ‘కూటమి’ పెద్దలు నెరవేర్చాలని మత్స్యకారులు ఆందోళన బాట పట్టారు.

పిఠాపురం: నిత్యం కాకినాడ హార్బర్‌తో పాటు, జిల్లాలోని వివిధ తీర ప్రాంతాల నుంచి గతంలో ప్రతి నెలా సుమారు 15,900 టన్నులకు పైగా చేపలు ఉత్పత్తి కాగా, రొయ్యలు 11 వేల టన్నులకు పైగా ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. పారిశ్రామికీకరణ పేరుతో ఇష్టారాజ్యంగా సముద్రంలో తవ్వకాలు జరపడంతో పాటు, వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలివేస్తుండడంతో సముద్ర గర్భంలో పర్యావరణం దెబ్బతింటోంది. కొన్ని రకాల నిషేధిత వలలు వేటకు విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల మత్స్య సంపద ఆదిలోనే అంతమవుతోంది. ముఖ్యంగా రింగు వలలు చేపల గుడ్లను సైతం వేటాడడం వల్ల మత్స్య సంపదకు శాపంగా పరిణమిస్తోంది. ఈ వలను నిషేధించినప్పటికీ, దీని అమలుకు మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. చేపల వేట నిషేధ సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల విచ్చలవిడిగా సాగిన చేపల వేటతో మత్స్య సంపద గుడ్ల దశలోనే నాశనమవుతోంది. వివిధ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం నేరుగా సముద్రంలో కలుస్తుండడంతో, సముద్ర గర్భంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. తద్వారా కొన్ని మత్స్య రకాలు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో టన్నుల కొద్దీ బరువైన తిమింగలాలు, సముద్ర తాబేళ్లు మత్స్యకారుల వలలకు చిక్కి, తీరానికి చేరడం సముద్ర పర్యావరణ అసమతుల్యతకు అద్దం పడుతున్నాయి.

పశ్చిమ రాజగోపురం వద్ద..

కాగా, విశాఖపట్నానికి చెందిన లారెస్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నిధులతో పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణ పనులు కూడా ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో వంద అడుగుల పొడవు, 175 అడుగుల వెడల్పున టెన్‌సిల్‌ షెడ్డు నిర్మించేందుకు లారెస్‌ కంపెనీ సంసిద్ధత తెలిపిందని అధికారులు చెప్పారు. మంచిరోజు చూసి పనులు ప్రారంభిస్తారని తెలిపారు.

శంకుస్థాపనకు ఏర్పాట్లు

అన్నవరం దేవస్థానంలో ప్రసాద్‌ నిధులతో వివిధ నిర్మాణాలకు శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో శంకుస్థాపన చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. అనంతరం నిర్మాణాలు వేగంగా కొనసాగించి, రెండేళ్లలోపు పూర్తి చేస్తాం.

– ఈశ్వరయ్య, చీఫ్‌ ఇంజినీర్‌, టూరిజం శాఖ

మత్స్యకారుల డిమాండ్లివీ..

నష్ట పరిహారం రూ.11,500 ఇవ్వాలి.

మత్స్యకారులకు రూ.50 లక్షల బీమా చేయించాలి.

సముద్ర తీరంలో ఉన్న కంపెనీల్లో మత్స్యకారులకు 20 శాతం ఉద్యోగాలివ్వాలి.

మత్స్యకారులను రైతులుగా గుర్తించి, డీసీసీబీ ద్వారా రుణాలు ఇవ్వాలి.

సీఎస్సార్‌ నిధులు మత్స్యకార గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలి.

సొసైటీలను పునరుద్ధరించి, పరికరాలకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలి.

మార్కెట్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి.

సన్నగిల్లుతున్న మత్స్యకారుల జీవనోపాధి

కూటమి నేతలు

ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌

డిమాండ్ల సాధనకు పోరుబాట పట్టిన మత్స్య కార్మిక, మత్స్యకార సంఘాల

ఐక్యవేదిక

నడిసంద్రాన సాపాట్లు1
1/4

నడిసంద్రాన సాపాట్లు

నడిసంద్రాన సాపాట్లు2
2/4

నడిసంద్రాన సాపాట్లు

నడిసంద్రాన సాపాట్లు3
3/4

నడిసంద్రాన సాపాట్లు

నడిసంద్రాన సాపాట్లు4
4/4

నడిసంద్రాన సాపాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement