
రిగ్గులతో మత్స్యకారులకు నష్టం
సముద్రంలో రిలయన్స్, ఓఎన్‌జీసీ రిగ్గుల వల్ల కాకినాడ జిల్లాలో అద్దరిపేట నుంచి గాడిమొగ వరకున్న తీర ప్రాంతంలో మత్స్యకారుల జీవితాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. సముద్రంలో కాలుష్యం పెరిగి, మత్స్య సంపద తగ్గి మత్స్యకారులు చేపల వేట సాగక తీవ్రంగా నష్టపోతున్నారు. తీరం వెంబడి ఉన్న వివిధ పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగి, చేపలు దొరక్క మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఇదే విషయమై గత ఎన్నికల్లో మా సమస్యలను కూటమి నేతల దృష్టికి తీసుకెళ్లాం. వాటిని పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటిచ్చారు. ఎన్నికలయ్యాక వాటిని విస్మరించారు. దీనిపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. మూడు రోజుల క్రితం పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించాం. ఆయన అందుబాటులో లేకపోగా, ఆయన ఇన్‌చార్జి కూడా అందుబాటులో లేక పోవడంతో మేము ఆందోళన చేయాల్సి వచ్చింది. చివరకు మా వినతిపత్రం జనసేన నేతలు తీసుకున్నారు. వారు స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. మా డిమాండ్లు అమలు చేసే వరకు ఉద్యమం ఆపేది లేదు.
– సీహెచ్ రమణి, ఏపీ మత్స్యకార, మత్స్య కార్మిక సంఘం, ఆలిండియా కమిటీ మెంబర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కాకినాడ
●