
డిమాండ్లు నెరవేర్చాలి
మత్స్యకారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేస్తాం. ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా పాలక యంత్రాంగం పెడచెవిన పెడుతోంది. ఇది చాలా దారుణం. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పటికే తినడానికి తిండి లేక మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారు. కూటమి పాలకులు వెంటనే స్పందించి మత్స్యకారుల డిమాండ్లు నెరవేర్చాలి. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేయాల్సి ఉంటుంది.
– సంగాడి ఈశ్వరరావు,
మత్స్య కార్మిక సంఘం నాయకుడు, కాకినాడ
●