
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్
అంబాజీపేట: పుల్లేటికుర్రు మలుపు వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారును ఏపీఎస్‌ఆర్టీసీ బస్ బలంగా ఢీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కామల నుంచి కె.పెదపూడి వైపు వెళుతున్న కారును అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. కారు ముందు బాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న కె.పెదపూడికి చెందిన సత్తిరాజాకు తీవ్ర గాయాలు కావడంతో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని అంబాజీపేట పోలీసులు పరిశీలించి ఆర్టీసీ బస్‌ను స్టేషన్‌కు తీసువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసం
మలికిపురం: మండలంలోని పడమటిపాలెం గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు నల్లి దాసు ఇంట్లో వస్తువులు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ మీటర్లతో పాటు మంచం, పరుపు కూడా కాలిపోయినట్లు దాసు తెలిపారు. ఈదురు గాలులుకు తోడు పిడుగులు పడ్డాయని ఆయన పేర్కొన్నారు.
అదృశ్యమైన కుటుంబాన్ని పట్టుకున్న పోలీసులు
కిర్లంపూడి: అదృశ్యమైన కుటుంబాన్ని గాలించి పట్టుకున్నామని జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మండల పరిధి బూరుగుపూడి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, బాలిక, బాలుడు గత ఏడాది నవంబర్ 9వ తేదీ అర్ధరాత్రి తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి గ్రామం విడిచి వెళ్లారు. సోదరుడు గణేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. మహారాష్ట్రంలోని షోలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు సమాచారం రావడంతో స్థానిక ఎస్సై జి.సతీష్ పోలీస్ సిబ్బందితో మాటువేసి శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది డబ్ల్యూహెచ్‌సీ గురుశ్రీ, పీసీ శివప్రసాద్ ఉన్నారు. చాకచక్యంగా పట్టుకుని ఎస్సై సతీష్‌ను, సిబ్బందిని పెద్దాపురం ఎస్‌డీపీఓ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ అభినందించారు.

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్