
గురుకుల పాఠశాలలో బాలికకు సీటు
జగ్గంపేట: సస్థానిక అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గంగవరం మండలం పిడతమామిడి గ్రామానికి చెందిన బాలిక వాకాడ కుసుమ అర్చనకు ఎట్టకేలకు గురుకుల పాఠశాలలో డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ ఆదేశాలతో సీటు లభించింది. రెండు రోజుల క్రితం అర్చనకు సీటు ఇస్తామని గురుకుల పాఠశాల నుంచి ఫోన్ రాగా, ఆమె చదువుతున్న పాఠశాలలోంచి టీసీ, సర్టిఫికెట్లు పట్టుకుని గురుకుల పాఠశాలకు వెళ్లగా రిజర్వేషన్‌లో తేడా వచ్చిందని సీటు ఇవ్వలేమని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పడంతో ఆమె ఆవేదన చెందింది. ఇదే విషయమై సాక్షి పత్రిక శ్రీఅయోమయంలో 7వ తరగతి విద్యార్థినిశ్రీ అనే శీర్షికతో కథనం ప్రచురించింది. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ విజయ కూడా బాలికను గురుకుల పాఠశాలలో జాయిన్ చేసుకోకపోవడానికి వున్న ఇబ్బందులను జిల్లా గురుకుల పాఠశాలల కో – ఆర్డినేటర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనితో ఆమె స్పందించి వాకాడ కుసుమ అర్చనను పాఠశాలలో జాయిన్ చేసుకోమని ఆదేశాలు ఇవ్వడంతో గురుకుల పాఠశాలలో కుసుమ అర్చనను జాయిన్ చేసుకున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ విజయ తెలిపారు.