
రూ.లక్ష విరాళం అందజేత
కాకినాడ సిటీ/కాకినాడ క్రైం: జిల్లా స్పోర్ట్స్ అఽథారిటీ మైదానంలో ఆగస్టులో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, మహిళల హాకీ టోర్నమెంట్ల నిర్వహణకు ఏపీఎన్‌జీవో జిల్లా శాఖ రూ.లక్ష విరాళమిచ్చి ఆదర్శంగా నిలిచింది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గత వారంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ర్యాలీ, క్రీడల ఘన నిర్వహణకు సంఘాల తరఫున చేయూతనందించాలని కోరారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో జిల్లా ఏపీఎన్‌జీవో శాఖ రూ.లక్ష మొత్తాన్ని సమకూర్చింది. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో సోమవారం ఆ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుద్దటి రామ్మోహన్, పేపకాయ వెంకటకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ చేతుల మీదుగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు అందించారు. ఈ మేరకు సంఘ నేతలను జేసీ అభినందించారు. జేసీని కలసిన వారిలో సంఘ జిల్లా సహ అధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు, సరెళ్ల చంద్రరావు, సంయుక్త కార్యదర్శి శశికుమార్ ఉన్నారు.