
● ‘తడుపు’.. మోపెడు !
పూర్వం మెట్ట రైతులు నానా ప్రయాసలూ పడి.. కావిళ్లతో నీరు మోసుకుని తెచ్చి, పొలాల్లోని మొక్కలకు నీరందించేవారు. కొన్నేళ్లుగా అన్ని సౌకర్యాలూ అందుబాటులోకి వచ్చాక ఇటువంటి పరిస్థితి ఇటీవల ఏ రైతుకూ రాలేదు. కానీ ఈ ఏడాది సాగు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో, రైతులు బకెట్లతో నీటిని తెచ్చుకుని మొక్కలకు పోసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. కనీసం పంట కాలువల్లో కూడా నీరు లేకపోవడంతో.. రైతులు అక్కడక్కడ ఉన్న బోర్ల నుంచి నీళ్లు మోసుకుని తెచ్చుకుని, ఎండిపోతున్న పంటను కాపాడుకోడానికి ఇలా యాతనలూ పడుతున్నారు.
– పిఠాపురం