
బంగారు కుటుంబాలను ప్రతి ఉద్యోగి దత్తత తీసుకోవాలి
పెద్దాపురం/జగ్గంపేట: ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో దొండపాటి చార్లెస్, స్వర్ణలత కుటుంబాన్ని దత్తత తీసుకున్న ఆయన.. మంగళవారం వారి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ వివరాలు, ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో శాంతా దుర్గమ్మ, ప్రత్తిపాడులో మాదే రమణ కుటుంబాలను కూడా తాను దత్తత తీసుకున్నానని చెప్పారు. అట్టడుగున ఉన్న కుటుంబాలను గుర్తించి సంపన్న కుటుంబాలు సాయం అందిచడమే పీ–4 లక్ష్యమని అన్నారు. అనంతరం వడ్లమూరులో మొక్కలు నాటారు. కాట్రావులపల్లిలో పర్యటించిన కలెక్టర్ షణ్మోహన్ పీ–4 కార్యక్రమంలో స్థానిక ఏగులమ్మ గుడి వద్ద ఉన్న శాంతా దుర్గమ్మ కుటుంబాన్ని కలిశారు. ఆమె భర్త సాంబశివరావు ఏడాది క్రితం మృతి చెందారు. ఎటువంటి ఉపాధీ లేకపోవడంతో ఇద్దరు పిల్లలతో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని కలెక్టర్ దత్తత తీసుకున్నారు. ఇంటి స్థలం మంజూరు చేసి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎంచుకునే ఉపాధి చెబితే సహకరిస్తామని తెలిపారు. నెల రోజుల సమయం తీసుకుని మండల అధికారులకు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్‌డీఓ కె.శ్రీరమణి, జిల్లా ప్రణాళికాధికారి త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాస్, పెద్దాపురం, జగ్గంపేట తహసీల్దార్లు, ఎంపీడీఓలు వెంకటలక్ష్మి, జేవీఆర్ రమేష్, శ్రీలలిత, ఏవీఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం అనుబంధ
నేరాలు నియంత్రించాలి
కాకినాడ క్రైం: మద్యం అనుబంధ నేరాలను నియంత్రించాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి అన్నారు. కాకినాడలోని కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరులో గత నెల 23న లిక్కర్ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సై కె.రవితేజ, కానిస్టేబుళ్లు జి.హనుమంతరావు నాయుడు, ఎం.భావనారా యణలను ఘనంగా సత్కరించారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిందని, పది మంది ముద్దాయిలను అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసు ద్వారా పాలకొల్లు, పాయకరావుపేట, కావలిల్లో స్ఫూరియస్ లిక్కర్ కేసులను ఛేదించామని చైతన్య మురళి చెప్పారు.

బంగారు కుటుంబాలను ప్రతి ఉద్యోగి దత్తత తీసుకోవాలి