వైఎస్ సీఎం కాకముందు మా ప్రాంతంలోని పొలాలకు ఒక్క పంటకు కూడా పూర్తిగా నీరందక బీడు వారేవి. వైఎస్ సీఎం అయిన తరువాత జలయజ్ఞంలో భాగంగా ఏజెన్సీలో నిర్మించిన ముసురుమిల్లి ప్రాజెక్టు వలన మా ప్రాంతానికి సమృద్ధిగా నీరందుతోంది. ఈ నీటిపై ఆధారపడి నేను 23 ఎకరాలు సాగు చేస్తున్నాను. వైఎస్ చలవతో ప్రస్తుతం రెండు పంటలకు నీరందుతోంది.
– కమ్మిల వీరబాబు, రైతు, గాదెలపాలెం, గోకవరం మండలం
పంటలు పండుతున్నాయ్
గతంలో బోరు నీటితో పంట సాగు చేసుకునేవాళ్లం. దిగుబడి తక్కువగా ఉండేది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పుష్కర ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. అప్పటి నుంచీ పంటలు బాగా పండుతున్నాయి. ఎత్తిపోతల పథకం రాక ముందు బోర్లు ఉన్నప్పటికీ నీరు అంతంత మాత్రంగానే వచ్చేది. పుష్కర పథకం వచ్చిన తరువాత ఇప్పుడు బోర్ల నుంచి కూడా నీరు కూడా బాగా వస్తోంది. పంటలు పుష్కలంగా పండుతున్నాయి.
– ఒబిన్ని రామదాసు, తాళ్లూరు, గండేపల్లి మండలం
నాకు ఎనిమిదెకరాల పంట భూమి ఉంది
తాండవ ప్రాజెక్టు నుంచి కోటనందూరు మండలానికి నీరు వదిలేవారు. మట్టి కాలువలు కావడంతో పొలాలకు నీరందాలంటే 10 నుంచి 15 రోజులు పట్టేది. రాజశేఖరరెడ్డి హయాంలో మట్టి కాలువలను రూ.55 కోట్లతో సీసీ కాలువలుగా అభివృద్ధి చేశారు. దీంతో పంటలకు నీరు త్వరగా, సమృద్ధిగా అందుతోంది. దిగుబడి బాగుంటోంది. రైతులందరూ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధితో చల్లగా ఉన్నారు.
– అంకంరెడ్డి శ్రీను, అల్లిపూడి, కోటనందూరు మండలం
దార్శనికుడు
మహానేత రాజన్న దార్శనికుడు. నేడు తుని పట్టణ ప్రజల దాహం తీరుతోందంటే అందుకు కారణం మహానేత వైఎస్ చలవే. నాడు ఆయన ముందుచూపుతో మంచినీటి ట్యాంకులు నిర్మించబట్టే ఈ రోజు మండు వేస విలోనూ దాహం కేకలు లేకుండా పోయాయి. తాండవ ఆధునీకరణ రాజశేఖరరెడ్డి హయాంలో మరో మణిహారంగా నిలిచిపోయింది. భవిష్యత్ తరాలు కూడా తాండవ ప్రగతిని గుర్తుంచుకోవడం ఖాయ మని చెప్పొచ్చు. అంతలా తాండవ ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు.
– దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
బీడు భూములు బంగారమయ్యాయి
బీడు భూములు బంగారమయ్యాయి
బీడు భూములు బంగారమయ్యాయి