
రైలు ఢీకొని వ్యక్తి మృతి
తుని: రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక జీఆర్పీ ఎస్సై జీ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం, కుమ్మరికిమ్ముడుపల్లికి చెందిన బోనంగి నూకరాజు(50) తుని రైల్వే స్టేషన్‌లో రెండో నంబర్ ఫ్లాట్‌పారం నుంచి ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారానికి వెళ్లడానికి పట్టాలు దాటుతుండగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు ఢీకొట్టింది. దీంతో నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ వివాహిత...
కరప: ఇంట్లో వంట చేస్తుండగా విషసర్పం కాటువేయగా, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందింది. కరప మండలం గురజనాపల్లి గ్రామానికి చెందిన బోనంగి లోవతల్లి(31) ఈనెల 3వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా ఒక విషసర్పం కాటువేసింది. వెంటనే ఆమెను చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలు లోవతల్లి భర్త ప్రసాద్‌కు మధ్య గొడవలు జరిగి ఏడాది కాలంగా గురజనాపల్లిలో తల్లితో పాటు ఉంటోంది. ఆమెకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా 2 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆమె సోదరి రాచకొండ శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప ఎస్‌ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.