
ఫ శాకంబరీ.. కారుణ్యమూర్తీ..
భక్తవరదాయినిగా ఖ్యాతికెక్కిన తలుపులమ్మ అమ్మవారిని.. ఆషాఢ మాసం మూడో ఆదివారాన్ని పురస్కరించుకుని శాకంబరి దేవిగా అలంకరించారు. దీనికోసం అమలాపురానికి చెందిన అర్లపల్లి శివ, ఏలూరి అయ్యప్ప ఆరు టన్నుల కూరగాయలు వితరణ చేశారని లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. గర్భాలయంలో స్వయంభువుగా వెలసిన అమ్మవారిని, పంచలోహ విగ్రహాలను కూరగాయలతో అలంకరించి, జీడిపప్పుతో కిరీటం అమర్చామని చెప్పారు. శాకంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తన్మయులయ్యారు.
– తుని రూరల్