
మరిడమ్మా.. కరుణించమ్మా..
పెద్దాపురం: ఆషాఢ మాస జాతర మహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం మరిడమ్మ తల్లిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఆలయం వద్ద భారీ క్యూలలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు సీఐ విజయ్ శంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక ఆధ్వర్యాన పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. చాచా విద్యా నికేతన్ ఆధ్వర్యాన అన్నదానం నిర్వహించారు.