ఆరుటి గెల! | - | Sakshi
Sakshi News home page

ఆరుటి గెల!

Jun 27 2025 4:35 AM | Updated on Jun 27 2025 4:35 AM

ఆరుటి గెల!

ఆరుటి గెల!

అంబాజీపేట: సాధారణంగా అరటి గెల రెండు లేదా మూడడుగులు ఉంటుంది. కానీ అంబాజీపేటలో పచ్చ అరటి గెల ఆరు అడుగులు ఉండి అబ్బురపరిచింది. కొర్లపాటివారిపాలేనికి చెందిన కొర్లపాటి వెంకటేశ్వరరావు తన పెరట్లో పచ్చ అరటి మొక్కను పది నెలల క్రితం నాటారు. టిష్యూ కల్చర్‌లో భాగంగా గింజ నాటడం ద్వారా వచ్చిన మొలకను స్థానిక పండ్ల వ్యాపారి గండ్రోతు సూరిబాబు ఇచ్చారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ మొక్కను నాటి సేంద్రియ ఎరువులు వాడడంతో సుమారు పది అడుగులు ఎత్తు ఎదిగి బలమైన గెలలు వేసిందన్నారు. చెట్టుకు భారం కాకుండా రెండు వెదురు గెడలను ఇరువైపులా వేసి బలంగా కట్టి చెట్టుకు నిలబెట్టామన్నారు. ఈ భారీ గెలకు 13 హస్తాల ద్వారా సుమారు 300 కాయలతో బలమైన గెల వేసిందన్నారు. అరటి గెలను పలువురు ఆసక్తిగా తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement