శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
సామర్లకోట: మాస్టర్ ట్రైనర్లు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఎంపీడీఓలు, ఈఓ పీఆర్డీ, సీనియర్ సర్పంచ్‌లకు మాస్టర్ ట్రైనర్లుగా ఈ నెల 10 నుంచి ఇచ్చిన శిక్షణ శుక్రవారం ముగిసింది. శిక్షణ పొందిన అధికారులు ఆయా జిల్లాల్లోని మహిళా సర్పంచ్‌లకు ఉత్తమ శిక్షణ అందించాలని ఈ సందర్భంగా రమణ సూచించారు. ఈ శిక్షణలు ఈ నెల 26న ప్రారంభించాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు కె.సునీల (కోర్స్ డైరెక్టర్) కేఆర్ నిహరిక, ఎం.చక్రపాణిరావు, టి.రామకృష్ణ, వి.జగన్నాథం, ఎ.రవిశంకర్, బి.ఆంజనేయులు పాల్గొన్నారు.
ఘనంగా చండీ హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు చండీ హోమం ప్రారంభించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. తరువాత వాటిని భక్తులకు పంపిణీ చేశారు. చండీహోమంలో 30 మంది భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. వేద పండితులు వేదుల సూర్యనారాయణ, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకుడు వేణు, వ్రత పురోహితులు చెల్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. ప్రధానాలయంలో సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యాన, తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్ ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి


