మీరు నిలిపిన ప్రాణాలే..
ఫ కాకినాడకు చెందిన అలీముద్దీన్ అన్సారీ రెండున్నరేళ్ల కుమారుడు 13 నెలల వయసులో ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్సకు భారీ ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ వైద్యులు చిన్నారికి చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అన్సారీ అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా చేసుకున్న కొద్ది రోజుల వ్యవధిలోనే రూ.10 లక్షల ఆర్థిక సాయం అందింది.
ఫ కాకినాడకు చెందిన పుచ్చకాయల మాధవి 50 ఏళ్ల వయసులో తలతో రక్తం గడ్డకట్టి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. నాటి ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి తన బాధను చెప్పుకుంది. అప్పటి సీఎం జగన్ తక్షణమే స్పందించి ఆమె వైద్యానికి రూ.5 లక్షలు విడుదల చేసి ఆమె ప్రాణాలు నిలిపారు. ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతోంది. తన యావత్ కుటుంబం తనపై ఆధారపడి ఉందని, తనకేమైనా అయి ఉంటే తన కుటుంబం రోడ్డున పడేదని ఆవేదన వ్యక్తం చేసింది.
– కాకినాడ క్రైం
మీరు నిలిపిన ప్రాణాలే..
మీరు నిలిపిన ప్రాణాలే..


