నిరుద్యోగ భృతి లేదు | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ భృతి లేదు

Jun 9 2025 12:51 AM | Updated on Jun 9 2025 12:51 AM

నిరుద

నిరుద్యోగ భృతి లేదు

నిరుద్యోగ భృతిని ప్రభుత్వం విజయవంతంగా ఎగ్గొట్టింది. 2014లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కేవలం ఒక్క నెల మాత్రమే.. అది కూడా ఎంపిక చేసిన తమ పార్టీ కార్యకర్తలకు ఒక్క నెల మాత్రమే నిరుద్యోగ భృతి అందజేసి అయిందనిపించారు. ఈసారి ఎన్నికల ముందు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మరోసారి నిరుద్యోగ భృతిని పెట్టారు. అది కూడా సూపర్‌ సిక్స్‌ పథకంలో దీనిని ఒక హామీగా చెప్పారు. గెలిచి ఏడాది అవుతున్నా ఆ హామీ నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను చంద్రబాబు రెండోసారి మోసం చేసి జోకొడుతున్నారు. జిల్లాలో సుమారు 20 వేల మంది వరకు నిరుద్యోగ యువత ఉంటుందని అంచనా. వీరికి నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాది కాలంలో రూ.36 వేలు కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టినట్టు అవుతుంది. మొత్తం మీద ఏడాది కాలంలో రూ.72 కోట్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఎగ్గొట్టింది.

నిరుద్యోగ భృతి లేదు
1
1/1

నిరుద్యోగ భృతి లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement