కానరాని పెళ్లి సందడి
అన్నవరం: దేవుని పెళ్లంటే ఊరంతా సంబరమే. ఎక్కడ చూసినా సందడే. చిన్నపాటి ఆలయమే అయినా.. దేవుని కల్యాణానికి నెల రోజుల ముందు నుంచే సన్నాహాలు మొదలవుతాయి. అటువంటిది రాష్ట్రంలోని అతి గొప్ప క్షేత్రాల్లో ఒకటైన అన్నవరం సత్యదేవుని కల్యాణమంటే ఇంకెంత సందడి ఉండాలి..! సన్నాహాలు ఎంత జోరుగా సాగాలి..! కానీ, సత్యదేవుని కల్యాణోత్సవానికి గడువు సమీపిస్తున్నా.. దేవస్థానంలో అటువంటి సందడే కనిపించడం లేదు.
కనీసం సమీక్ష కూడా లేదు
అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలు వచ్చే నెల 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. దీనికి ఇక 17 రోజులు మాత్రమే గడువుంది. ఈ ఉత్సవాల నిర్వహణపై ఈపాటికే సన్నాహాలు మొదలైపోవాలి. గతంలో నెల రోజుల ముందే సమన్వయ శాఖల సమావేశాలు, వరుస సమీక్షలు నిర్వహించే వారు. రత్నగిరిపై కల్యాణోత్సవ పనులు జోరుగా జరిగేవి. ఎందుకో కానీ, కల్యాణ ఘడియలు సమీపిస్తున్నా ఈ ఏడాది అసలు ఉత్సవ ఏర్పాట్లే ఆరంభం కాలేదు. ఆలయ ప్రాంగణంలో రంగులు మాత్రమే వేస్తున్నారు. ఈ నెల 30న జరగనున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లపై దేవదాయ శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ తదితరులు గత బుధవారం సమీక్షించారు. కానీ, ఈ చందనోత్సవానికి వారం రోజుల తరువాత జరిగే సత్యదేవుని కల్యాణోత్సవాలపై ఇప్పటి వరకూ ఎటువంటి సమీక్షా నిర్వహించలేదు. దేవస్థానం సిబ్బందితో ఈఓ వీర్ల సుబ్బారావు కేవలం ఒక్కసారి సమావేశమయ్యారు. శ్రీరామ నవమి నాడు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కల్యాణోత్సవాల నిర్వహణలో దేవస్థానంతో పాటు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య, జిల్లా ప్రజా రవాణా (ఆర్టీసీ) తదితర శాఖలు పాలు పంచుకుంటాయి. ఆయా అధికారులతో ఈపాటికే సమన్వయ సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు.
చీఫ్ ఫెస్టివల్ అధికారి అవసరం
రాష్ట్రంలో విజయవాడ కనకదుర్గమ్మవారి దసరా ఉత్సవాలు, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవం, శ్రీశైలంలో మహాశివరాత్రి, కార్తిక మాసం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఉత్సవాల సందర్భంగా దేవదాయ శాఖలో అనుభవజ్ఞులైన అధికారులను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. అన్నవరం దేవస్థానంలో ఇప్పటి వరకూ అనుభవజ్ఞులైన అధికారులే ఈఓలుగా ఉండటంతో ప్రత్యేకాధికారులను నియమించడం లేదు. ప్రస్తుత ఈఓకు దేవస్థానం వ్యవహారాలు, ఉత్సవాల నిర్వహణలో అంత అనుభవం లేదు. ఈ ఏడాది కల్యాణోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. అలాగే, రథోత్సవానికి కూడా గిరి ప్రదక్షిణ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లుగా దేవస్థానంలో జరుగుతున్న వివాదాస్పద పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకాధికారిని నియమించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
·˘ Ð]l^óla ¯ðlÌS 7 ¯]l$…_ çÜ™èlŧólÐ]l#° ¨Ð]lÅMýSÌêÅ׿ Ð]l$çßZ™èlÞÐéË$
·˘ VýSyýl$Ð]l# çÜÒ$í³çÜ$¢¯é² M>¯]lÆ>° HÆ>µr$Ï
·˘ ´ùçÜtÆŠ‡ BÑçÙPÆý‡×æ™ø çÜÇ
·˘ çÜÐ]l$¯]lÓĶæ$ MýSÑ$sîæ çÜÐ]l*ÐólÔèæ… FõÜ Ìôæ§ýl$
ముసుగు వీడని రథం
సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల సందర్భంగా మే 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీని కోసం గత ఏడాది రూ.1.08 కోట్లతో భారీ టేకు రథం నిర్మించారు. గతంలో సత్యదేవుని ఊరేగింపు వాహనాల్లో అత్యంత పెద్దది రావణబ్రహ్మ వాహనమే అతి పెద్దదిగా ఉండేది. ఇది సుమారు 20 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పున ఉంటుంది. ఈ వాహనంపై సత్యదేవుని ఊరేగింపును వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తూంటారు. ఈ రావణబ్రహ్మ వాహనం కన్నా టేకు రథం దాదాపుగా రెట్టింపు సైజులో ఉంటుంది. దీని ఎత్తు 35.8 అడుగులు. వెడల్పు 14.6 అడుగులు. పొడవు 21 అడుగులు. ఈ రథానికి ఆరడుగుల ఎత్తున ఆరు చక్రాలున్నాయి. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం ఎత్తు 38 అడుగులు కాగా, దీని కంటే సత్యదేవుని టేకు రథం 2.4 అడుగులు మాత్రమే చిన్నది. ఈ రథానికి ఆకర్షణీయమైన రంగులు, ముందు భాగంలో గుర్రాల బొమ్మలు, చక్రాలకు హైడ్రాలిక్ బ్రేకులు ఏర్పాటు చేశారు. గత ఏడాది కల్యాణోత్సవాల సందర్భంగా ఈ రథం ట్రయల్ రన్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఇంత ఎత్తు రథాన్ని మిట్టపల్లాలుగా ఉండే అన్నవరం మెయిన్ రోడ్డులో లాగడం చాలా కష్టం. ఏ ఇబ్బంది వచ్చినా అదుపు చేయడానికి జేసీబీ రక్షణగా ఉండాలి. గత ఏడాది అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ నిపుణులు, ఇంజనీరింగ్, ఇతర సిబ్బంది సహకారంతో ట్రయల్ రన్, తరువాత రథోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఈ రథాన్ని పంపా సత్రంలో ముసుగు కప్పి ఉంచారు. అప్పటి నుంచీ ఆ రథం ఎలా ఉందో ఏ ఒక్కరూ పట్టించుకోనే లేదు. ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా రథం ముసుగు తీయలేదు. ప్రస్తుతం కల్యాణోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఈ రథానికి ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంది. దీని ఫిట్‌నెస్‌ను నిపుణులతో పరీక్షించాలి. అటువంటి పనులు ఇంత వరకూ మొదలు కాలేదు. రథాన్ని నేల పైనే ఉంచడంతో దాని చక్రాలకు చెదలేమైనా పట్టాయా.. పడితే ఏం చేయాలనేది కూడా పరిశీలించలేదు.
కానరాని పెళ్లి సందడి
కానరాని పెళ్లి సందడి


