జననేతకు జేజేలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు.. సంక్షేమ ప్రదాత.. పేదల బాంధవుడు.. విద్యార్థులకు మావయ్యగా.. పింఛనర్లకు పెద్ద కొడుకుగా.. అక్కచెల్లెమ్మలకు సోదరుడిగా.. రాజకీయాల్లో సమున్నత విలువలకు పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు జననేత జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని జేజేలు పలికారు. పెద్ద ఎత్తున కేక్‌లు కట్ చేసి, మిఠాయిలు పంచి, సంబరాలు చేసుకున్నారు. రక్తదాన శిబిరాలు, దుప్పట్లు, పండ్ల పంపిణీ తదితర రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ ప్రియతమ నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
పేదల అభ్యున్నతే జగన్ జీవితాయశం
పేదల అభ్యున్నతి కోసం జీవిత కాలం పని చేసే శక్తిని, హోదాను వైఎస్ జగన్‌కు దేవుడు ప్రసాదించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆకాంక్షించారు. రమణయ్యపేట వైద్య నగర్‌లోని పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జగన్ బర్త్‌డే కేక్‌ను ఆయన కట్ చేసి, అందరికీ పంచారు. వృద్ధాశ్రమాల్లో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఐదేళ్ల జగన్ పరిపాలనలో రెండేళ్లు కోవిడ్‌తో పోయినా.. ఆయన అందించిన సంక్షేమం, అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని కన్నబాబు అన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఫ జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్న ప్రజలు
ఫ విస్తృతంగా సేవా కార్యక్రమాలు


