జగ్గంపేటలో రక్తదాన శిబిరం
జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం ఆధ్వర్యాన జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీరాంజీ సహా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగ్గంపేటలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అన్నసమారాధన నిర్వహించారు. పార్టీ నాయకులు రామూర్తి జగాలు, గుల్లా ఏడుకొండలు, ఎంపీపీ చలగల్ల దొరబాబు, బండారు రాజా, పెద్దాడ రాజబాబు, దాసరి పెదకాపు, పాటి చినబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం, జెడ్పీటీసీ సభ్యురాలు బిందుమాధవి ఆధ్వర్యంలో జగ్గంపేటలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గండేపల్లి, కిర్లంపూడిల్లో కూడా వేడుకలు ఘనంగా జరిగాయి.
సామర్లకోటలో వైద్య శిబిరాలు
సామర్లకోట అన్నపూర్ణ కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన భారీ ఎత్తున రక్తదాన, నేత్ర, వైద్య శిబిరాలు నిర్వహించారు. దొరబాబు, పార్టీ నేతలు కేక్ కట్ చేసి చిన్నారికి, దివ్యాంగునికి తినిపించారు. కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంకు వైద్యుడు కామరాజు ఆధ్వర్యాన సిబ్బంది రక్తం సేకరించారు. పలువురు ప్రజలు కంటి, బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. పెద్దాపురం క్రిస్టియన్‌పేటలో ఐటీ సెల్ అధ్యక్షుడు వి.ఇమ్మానియేల్ రాజు ఆధ్వర్యాన దొరబాబు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, రాష్ట్ర అయ్యెరక సంఘం అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు, సీనియర్ నాయకుడు దవులూరి సుబ్బారావు, ఎంపీపీలు బొబ్బరాడ సత్తిబాబు, పెంకే సత్యవతి, జెడ్పీటీసీ సభ్యుడు గవరసాని సూరిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అత్తిలి వెంకట సీతారామస్వామి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇనకొండ విష్ణుచక్రం తదితరులు పాల్గొన్నారు.
జగ్గంపేటలో రక్తదాన శిబిరం


