అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
తుని రూరల్: తుని మండలం కె.సీతయ్యపేట గ్రామానికి చెందిన వివాహిత సూరాడ నూకరత్నం (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు. సోమవారం రాత్రి కడుపు నొప్పితో బాధపడుతున్న నూకరత్నాన్ని కుటుంబ సభ్యులు తుని ఏరియా ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక అందాల్సి ఉందన్నారు. నూకరత్నం, శివ (భార్యాభర్తలు) మధ్య ఏర్పడిన తగాదాలపై గతంలో రెండుసార్లు ఫిర్యాదులు అందగా ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్టు ఎస్సై వివరించారు. మృతురాలికి
భర్తే హతమార్చాడని ఫిర్యాదు
తన కుమార్తెను భర్త సూరాడ శివ హతమార్చాడని మృతురాలు నూకరత్నం తల్లి యజ్జన వెంకటలక్ష్మి ఆరోపించింది. ఒకే గ్రామానికి చెందిన నూకరత్నం, శివలకు ఎనిమిదేళ్ల కిందట వివాహం అయ్యింది. వీరిద్దరికి వైష్ణవి, హర్షిత, ధనుష్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన కుమార్తెను అల్లుడు తరచూ వేధించేవాడని, రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదని ఆరోపించింది. దీంతో సూరాడ శివ విషం కలిపిన ఆహారంతో నూకరత్నాన్ని హతమార్చినట్టు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినప్పుడు కేసులు నమోదు చేసి శిక్షిస్తే నా కుమార్తె బతికేదని తల్లి వెంకటలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చెప్పింది. హంతకుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, పిల్లలకు న్యాయం చేయాలని కోరింది.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి


