సీటీఎస్ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏఐటీటీ–25 అండర్ సీటీఎస్ పరీక్ష రాయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జీవీకే వర్మ బుధవారం తెలిపారు. 12వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 97012 15511 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు
దరఖాస్తు చేసుకోండి..
కాకినాడ సిటీ: కాకినాడ జిల్లాలో అర్హతగల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు మెగా డీఎస్సీ పరీక్షకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారిణి ఎం లల్లీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లోనే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కులధ్రువీకరణ పత్రం, టెట్ పరీక్షలో అర్హత సాధించి రుజువు వంటివి జతపరచాలన్నారు. దరఖాస్తును వెనుకబడిన తరగతుల సంక్షేమం అండ్ సాధికారత అధికారి కార్యాలయం, 2వ అంతస్తు, ప్రగతి భవన్, డీఆర్‌డీఏ కాంప్లెక్స్, కాకినాడ చిరునామాలో సమర్పించాలని ఆయన సూచించారు.
సత్యదేవునికి ఘనంగా
జన్మ నక్షత్ర పూజలు
అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా బుధవారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరిచి స్వామి, అమ్మవార్లకు అర్చక స్వాములు సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్‌లకు, శివ లింగానికి పండితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ల రసాలు పంచామృతాలతో మహాన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం సుగంధ భరిత పుష్పాలతో, స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అర్చకులు దత్తాత్రేయ శర్మ, సుధీర్, పవన్ ఈ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి యాగశాల లో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు అయుష్య హోమం, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. బుధవారం సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది.
నేడు నిజరూప దర్శనం
సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరులు గురువారం ఏ విధమైన ఆభరణాలు ధరించకుండా (మూల విరాట్‌లుగా) నిజరూపులో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
చిన్నారులకు
ఆధార్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కాకినాడ సిటీ: జిల్లాలో 0–6 సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారులకు వెంటనే ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలని, ఆధార్ నంబర్ లేని చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టిక ఆహార సేవలు నిలిపివేస్తామని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సీ్త్ర, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి, సీడీపీవోలు, పోస్టల్, సీఎస్సీ, ఆధార్, జీఎస్డీబ్ల్యూఎస్ అధికారులతో ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆధార్ రిజిస్ట్రేషన్, ఆధార్ నమోదు క్యాంపుల నిర్వహణ ఇతర అంశాలపై కలెక్టర్ షణ్మోహన్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారం పొందుతున్న 0–6 చిన్నారులకు తప్పనిసరిగా ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఆధార్ చిన్నారులకు మే నెల నుంచి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం నిలిపి వేయాలని కలెక్టర్ చెప్పారు. ఐసీడీఎస్ పీడీ కె విజయకుమారి, సీడీపీవోలు, పోస్టల్ ఆధార్ మేనేజర్ రాజ్‌కుమార్, సీఎస్‌ఈ ఆధార్ మేనేజర్ ఆదిత్య, జీఎస్డీబ్ల్యూఎస్ ఆధార్ కోఆర్డినేట్ శంకర్ పాల్గొన్నారు.


