ఖరీఫ్‌ సాగు లక్ష్యం 97,543 హెక్టార్లు | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ సాగు లక్ష్యం 97,543 హెక్టార్లు

May 22 2024 12:45 AM | Updated on May 22 2024 12:45 AM

ఖరీఫ్‌ సాగు లక్ష్యం  97,543 హెక్టార్లు

ఖరీఫ్‌ సాగు లక్ష్యం 97,543 హెక్టార్లు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా రానున్న ఖరీఫ్‌లో 97,543 హెక్లార్లలో వివిధ పంటలు సాగు చేయాలనేది లక్ష్యమని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఖరీఫ్‌ ప్రణాళికపై కాకినాడ కృషి భవన్‌లో మంగళవారం జరిగిన ఒక రోజు శిక్షణలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌ పంట కాలంలో రైతులకు మరింత మేలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఈ శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా పలు వ్యవసాయ సబ్‌ డివిజన్లలో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులు వివరించారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థ, పెద్దాపురం డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఖరీఫ్‌లో ఏయే పంటలు సాగు చేయాలి, ఆయా పంటల సాగులో తీసుకోవలసిన మెళకువలు, ఎరువుల యాజమాన్యంపై వివరించారు. అనంతరం ప్రత్తిపాడు, కాకినాడ, కరప సబ్‌ డివిజన్‌ అధికారులు సేంద్రియ వ్యవసాయం, పొలంబడి, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల చట్టాలపై వ్యవసాయ శాఖ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు శిక్షణ కేంద్రం డీడీ బీవీఎస్‌సీ హరి, ఆత్మ పీడీ జ్యోతిర్మయి పాల్గొన్నారు.

హింసకు తావు లేదు..

ఆ ప్రచారంలో నిజం లేదు

కాకినాడ క్రైం: ఓట్ల లెక్కింపు వేళ కాకినాడ, పిఠాపురాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్‌ వెల్లడించిందన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హింసకు ఏ మాత్రం తావు లేదని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు, సాయుధ దళాల భద్రత కట్టుదిట్టంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విఘాతానికి పాల్పడే అవకాశం ఉన్న పలువురిని ఇప్పటికే బైండోవర్‌ చేసి, ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. తాము తీసుకుంటున్న చర్యల ఆధారంగా కౌంటింగ్‌ రోజున అవాంఛనీయ సంఘటనలకు ఏమాత్రం ఆస్కారం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిని ఐటీ ప్రత్యేక బృందం గుర్తిస్తుందని తెలిపారు. ప్రజలను భయాందోళనలకు గురి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ఈఏపీ సెట్‌కు

97.43 శాతం హాజరు

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో ఏపీ ఈఏపీ సెట్‌ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఈ ఆన్‌లైన్‌ పరీక్షకు ఉదయం 581 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 897 మంది హాజరు కాగా 23 మంది గైర్హాజరయ్యారని సెట్‌ కన్వీనర్‌ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 28,087 హాజరు కాగా 1,817 మంది పరీక్ష రాయలేదని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement